(దండుగుల శ్రీనివాస్)
ఖడ్గం సినిమాలో ఓ పాటుంది. నమ్మితే ప్రాణలైనా ఇస్తాం.. .నమ్మడమేరా కష్టం..! అచ్చం ఇలాగే ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి స్పీచ్. నిజామాబాద్‌లో ఆయన చేసిన ప్రసంగం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతటి గడ్డు పరిస్తితులు ఎదుర్కొంటున్నాడో.. గెలుపు ఎంతటి అనివార్యమో.. ఓటమి గుమ్మం అంచుల్లో ఎలా నిలబడి ఉందో తెలియజేసింది. ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి..! అని వేడుకోవడం ఆయన వంతే. నమ్మితే ఓటేయండి.. లేకపోతే లేదు. అని బెదిరీయడమూ ఆయన వంతే. సేమ్ కేసీఆర్‌లాగే బెదిరింపు రాజకీయాల్లో భాగంగా.. నరేందర్ రెడ్డిని ఓడిస్తే మాకొచ్చే నష్టమేమీ లేదు… కానీ మీకే నష్టం.. మీ తరపున మాట్లాడేవాళ్లుండరు..! అని తన మనస్తత్వాన్ని చాటుకోవడమూ ఆయనకే చెల్లింది. పనిలో పనిగా తన చేతగాని తనాన్ని కూడా ఒప్పుకున్నాడీవేళ. కేసీఆర్, కేటీఆర్, హరీశ్..వీళ్లందరినీ నేను అరెస్టు చేయలేపోతున్నానన్నాడు. ఎందుకంటే బీజేపీ వాళ్లు సహకరిస్తలేరట. మరి ఇంతలా ఎందుకు వాగావు. ఎందుకు ఎగిరావు. అసలు నువ్వు చెప్పింది ఒక్కటైనా కరెక్టుగా చేసి చూపావా..! లేదు.
అంతే కాదు.. నేను మీకిచ్చి హామీలన్నీ నెరవేర్చకపోవడానికి కారణం…. మాది పదినెలల పాలనే అని కొత్త భాష్యం చెప్పాడు. పాడిందే పాటరా.. పాసుపండ్ల దాసరి అని నెలకే 6,500 కోట్ల మిత్తీ కడుతున్నాను తెలుసా..? మాకేంటీ ఖర్మా..! ఇంతలా అప్పులు చేస్తాడా…! అని వళ్లెవేశాడు. మరి అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న చందంగా నువ్వు ఇంకా గొప్ప గొప్ప హామీలు ఇచ్చి వచ్చావు కదా.. జనన్ని నమ్మించి నట్టేటా ముంచావు కదా. ఇక నమ్మడం ఎక్కడ..? నీ మీద విశ్వాసం ఎక్కడ…???
అరెస్టులు లేవన్నాడు. చేతగాని తనాన్ని ఒప్పుకున్నాడు. పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా పట్టభద్రుల సాక్షిగా నేనేం కేసీఆర్‌కు తక్కువ కాదు.. అంతకంటే చీపుఈ విషయంలో అని చెప్పుకొచ్చాడు. నువ్వు మీ పార్టీలో చేర్చుకోనప్పుడు రాని ఉప ఎన్నికలు .. ఇప్పుడెలా వస్తాయి..? అన్నాడు. అంటే మేం రానీయం.. కాపాడుకుంటాం.. నీలాగే అన్నాడు రేవంత్. దమ్ముంటే వారిని రిజైన్ చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా. తుక్కు తుక్కు ఓడగొడతారనే భయం. కేసీఆర్ దారిలోనే నేనూ పోతున్నానని చెప్పుకొచ్చాడు అంతిమంగా.
బొమ్మరిల్లు సినిమాలో హీరోలాగా అంతా మీరే చేశారు నాన్న.. అన్నట్టుగా అయితే కేసీఆర్. లేదా బండి సంజయ్, కిషన్‌రెడ్డి. ఇవే మాటలు ఇంకెన్నాళ్లూ. అయితే నీతో ఏదీ కాదన్నమాట. నువ్వో డమ్మీ బొమ్మవా..! ఇంకా ఇది చాలదంటూ కులగణన చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడంటా. కేసీఆర్ వల్ల కాలేదు. నీవల్లా కాదు. ఎందుకంటే బహుజనులెప్పుడు మీ రాజకీయాలకు బలి పశువులు. ఎన్ని మాటలు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. నిన్ను. కేసీఆర్ ను. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ.. ఎవరెన్ని ఫేక్ ప్రచారాలు చేసిన గెలిచి తీరుతానన్నాడు. ఆ అహంకారమే నీ కొంపముంచనుంది నరేందర్. అసలు నిన్ను అభ్యర్తిగా ఎన్నుకోవడమే కాంగ్రెస్ నైతిక ఓటమి. అంటున్నారంతా.