(దండుగుల శ్రీనివాస్)
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు దావోస్‌లో పర్యటిస్తుంటే.. ఇక్కడ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నాయకులు తన్నుకొని ఇజ్జత్ తీసుకుంటున్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇక్క డి ఇంట్లో మంటలు చెలరేగుతున్నాయి. అసలే అధికారం లేక చాలా కాలమైంది. రాక రాక అధికారం వచ్చింది. ఇక ఆగుతారా. నాకు పదవి కావాలె. నేను సీనియర్. వాడు మొన్ననే వచ్చిండు. వానికెట్లిస్తవ్…? అంటూ ఏకంగా గాంధీభవన్‌లోనే ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టుండ్రు ఒకడిని. ఇప్పటికే గ్రామ సభల్లో అధికారులను, నాయకులను నిలదీసే పరిస్థితి వచ్చింది. సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక్కడ మీడియా మొత్తం సీఎం దావోస్ పర్యటన.. ఇన్ని వేల కోట్లు.. అన్ని వేల కోట్లు ఇగ రాష్ట్రానికి వచ్చేసినయ్.. బాగుపడిపోయినం.. అనే రేంజ్ లో కటింగ్ ఇస్తుంటే.. గాంధీభవన్‌లో ఆ పార్టీ నాయకులు తన్నుకొని , వీడియోలు తీసుకుని వారే వైరల్ చేసుకుని ఇలా రోడ్డుకెక్కారు. పార్టీ పరువును బజారులోకి లాగుతున్నారు. అయినా ఇది కాంగ్రెస్‌కు కొత్త కాదంటారా..? అంతటి స్వేచ్చ వారికి ఉంది. అందుకే ఇలాంటివన్నీ కామనే. మున్ముందు ఆ పై ముందు కూడా ఇలాంటికి మస్తే మనం చూస్తం. దీనికే అంతలా ఫీలయితే ఎలా…? ఇప్పుడు మళ్లా దావోస్ పెట్టుబడుల గురించి మాట్లాడుకుందామా..!