(దండుగుల శ్రీనివాస్)
కేటీఆర్ సోషల్ మీడియా టైగర్ అయిపోయాడు. ఎవరు ఏమన్నా.. చీమ చిటుక్కుమన్నా స్పందిచేస్తున్నాడు. కారణం.. ఆయన ఓ పెయిడ్ టీమ్‌ను మెయిన్‌టేన్ చేస్తున్నాడు. నెలకు కోటి రూపాయలకు పైగా వీరికే వెచ్చిస్తున్నాడు. బీఆరెస్ కరపత్రం నమస్తే తెలంగాణను మాత్రం గాలికొదిలేశారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ టాపిక్ దేనికంటారా..? వస్తున్న. అక్కడికే.
కేటీఆర్ సోషల్ మీడియాలో ఏ పేపర్లో ఏ వార్తొచ్చినా దాని కటింగ్ తీసుకని పోస్టు చేసి దానికి తన టీమ్ చేత కవితాత్మకంగా ఓ ట్వీట్, ఓ మెసేజ్, ఓ విమర్శ చేస్తూ అలా ఎప్పుడూ … ఎప్పుడూ అనేకన్నా ఇరవైనాలుగ్గంటలూ లైవ్‌లో ఉండిపోతున్నాడు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన వార్తలు మినహా మిగితా ఏ పేపర్లోనైనా వార్తలు రాని.. వాటికే ప్రయార్టీ ఇస్తున్నాడు మన రామ్. దిశ, ఆంధ్రజ్యోతి, ఈనాడు… సాక్షి.. ఇలా . ఆఖరికి తను తిట్టిపోసే వెలుగు కూడా ఇందులో ఉంటుంది.
కానీ నమస్తే తెలంగాన పేపర్లో వచ్చిన వార్తలను మాత్రం తీసుకోడు. వాడుకోడు. అసలే ముట్టుకోడు. ఎందుకు..? దానిపై జనాలకు నమ్మకం లేదనా..? లేక నీకే నమ్మకం లేదా..? జనమే కాదు తమ పార్టీ నేతలే నమ్మడం లేదని తెలిసిపోయిందా…? ఏదో ఒకటి. ఏదైతే ఏముందిలే. మొత్తానికి నమస్తే తెలంగాణను కేటీఆర్ నమ్మడం లేదనేదనేది వాస్తవం. దాన్ని గిన్తీలోకి కూడా తీసుకోవడం లేదనేది ఖుల్లంఖుల్లా ముచ్చటని తేలింది. ఇక ఇంకో ముచ్చట గురించి చెప్పుకోవాలి. ఈ క్లిప్పుంగు సారాంశం.. కాంగ్రెస్‌కు అంటే.. సీఎం రేవంత్‌కు ఇక్కడి బీజేపీ నేతలు సపోర్టు చేస్తున్నారు. చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.. మోడీ ఏమో కలిసికట్టుగా ముందుకు పోవాలంటున్నాడు…. ఇదెట్లా సాధ్యం..? అని ప్రశ్నించి నిలదీసి.. కడిగేసి.. అడిగేసి.. తన అలవాటుదోరణిని ఇలా బయటపెట్టుకున్నాడు.
అసలు దీన్ని ఎవరు నమ్ముతారు రాము…? బీఆరెస్, బీజేపీ ఒకటే అంటే నమ్ముతారు. మీరిద్దరి రహస్య దోస్తానా అంటే అవును.. అంటారు. రేపు రేపు భవిష్యత్తులో బాహాటంగానే ఇద్దరు పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు పోయినా ఎవరూ ఆశ్చర్యపడరు. నువ్వింకా ఇదే ముచ్చట చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. పనికి ఆహారం పథకం కింద కూలీలను పెట్టుకున్నావని ఇలా ఏది పడితే అది.. దేనికి పడితే దానికి స్పందిస్తూ పోతే కూడా నవ్వుకుంటున్నారు జర సూస్కో రామ్….!