(దండుగుల శ్రీనివాస్)
ఆయనో స్వయం ప్రకటిత మేధావి. తనకు తానుగా సొంతంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్‌గా ప్రకటించుకున్నాడు. డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా ప్రకటించుకుని, ఉద్యోగ జేఏసీ కి తానే చైర్మన్ అని ప్రకటన విడుదల చేసుకుని సర్కార్‌తో టచ్‌లో ఉండే మెంటాలిటీ అన్నట్టు. సర్కార్ ఏదున్నా.. అధికారంలో ఎవరున్నా అలా తను చెప్పింది కావాలనుకునే మనస్తత్వం. బయట కూడా తన గురించి అంతా గొప్పలు చెప్పుకోవాలనే డంబాచార ఉద్యోగి అన్నట్టు. ఇప్పుడిదంతా చర్చ ఎందుకంటే.. ఆయనకు మొన్న ఉన్న ఉద్యోగం తీసేశారు.ఎక్కడా పోస్గింగ్ ఇవ్వలేదు ప్రభుత్వం. అంతే తన కిరీటం కింద పడిపోయి .. అవమానం పాలై పోయి.. ఆగమాగం చేసి ఎలాగోలా మళ్లీ ఓ పోస్టింగ్ తెచ్చుకున్నాడు.
అదీ ప్రాధాన్యత లేని పోస్టింగే అనుకోండి. అది వేరే విషయం. కానీ దీని కోసం కోట్లు వెచ్చించాడట. ఎవరికిచ్చాడు…? అనేది ఉద్యోగ వర్గాల్లో అందరికీ తెలిసిన టాపికే. దీనికి సంబంధించిన శాఖ మంత్రి కి ఈ స్వయం ప్రకటిత మేధావి, చైర్మన్‌కు పోస్టింగ్ ఇవ్వడం సుతారామూ ఇష్టం లేదట. కానీ కోట్లు కుమ్మరించి మరీ ఏదో ఒక పోస్టింగ్ తెచ్చుకున్నాడు. నేనున్నాను అంటూ సర్కార్ వాకిలిలో వాలేందుకు తన ఐడెంటిటీనీ కాపాడుకునేందుకు ఇలా తంటాలు పడుతున్నాడు. ఇతగాడిపై సదరు ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసేందుకు రరెడీ అయ్యారట. ఇలా ఉందండీ మరి ఉద్యోగ నేత సంగతి.