వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
పార్టీలు వేరైనా దేశాభివృద్ధిలో అందరూ కలిసి ముందుకెళ్లాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వు ఫారెస్టులో రాడార్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రక్షణ మంత్రి ప్రసంగించారు. అబ్దుల్ కలాం జయంతి నాడు వీఎల్‌ఎఫ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఏర్పాటుకు అన్ని విధాలా అండగా నిలిచిన సీఎం రేవంత్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. రక్షణరంగ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు గొప్ప పేరుందని, దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకంగా మారిందన్నారు. దేశ భద్రత విషయంలో వీఎల్‌ఎఫ్ పాత్ర కీలకమన్నారు. కమ్యూనికేషన్ విషయంలో ఈ కమాండ్ సెంటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
కమ్యూనికేషన్ విషయంలో భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలి. సాంకేతికయుగంలో కమ్యూనికేషన్ అనేక రకాలుగా ఉపయోగ పడుతుంది. కమ్యూనికేషన్ రంగంలో పావురాలు, గుర్రాల నుంచి ఇక్కడి వరకు వచ్చాం. తపాలా వ్యవస్థను అనేక ఏళ్లుగా వినియోగించుకున్నాం. ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగం.. సమాచారం క్షణాల్లో చేరుతోంది. సమాచార విప్లవం.. ఇవాళ అనేక దేశాలను దగ్గర చేస్తోంది. విద్య, వైద్య రంగాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. ఇంట్లో కూర్చునే అనేక కోర్సులు నేర్చుకునే అవకాశం వచ్చింది. వీఎల్‌ఎఫ్‌కు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు అన్నారు. నావికారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్ఠం చేసుకోవడం అనివార్యం. ఇండోపసిఫిక్ ప్రాంతంలో పుష్కలంగా ఖనిజ సంపద ఉంది. సముద్రంపై ఆధిపత్యం సాధించిన వాళ్లే మరింత అభివృద్ధి చెందుతారు. సముద్రంపై ఆధిపత్యం ఆంగ్లేయుల విస్తరణకు ఎంతో ఉపయోగపడిరది. అత్యాధునిక పరికరాల ద్వారా రక్షణరంగాన్ని బలోపేతం చేస్తాం. దేశ రక్షణ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీ పడబోము. దేశ రక్షణ, భద్రత విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గం. వీఎల్‌ఎఫ్ వల్ల స్థానికులపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రం ప్లాన్ రెడీ చేసింది. వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుకు ఎప్పుడో కేంద్రం ఓకే చెప్పింది. ఇన్ని రోజులకు మంగళవారం భూమిపూజ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల 55 నిముషాలకు భూమిపూజ జరిగింది. దేశంలోనే అతిపెద్ద రెండో వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా దీన్ని 2027 నాటికి పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. దీని నిర్మాణానికి 2,900 ఎకరాల అటవీ భూమిని ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూమి అప్పగింతతో ఇక్కడ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు మార్గం సులభమైంది. ఈ రాడార్‌లో సదుపాయాలు కల్పించేందుకు ఈ అటవీ ప్రాంతం చుట్టూ దాదాపు 24 కిలోవిూటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాడార్ స్టేషన్‌తోపాటు 2500 మంది నివాసం ఉండేలా టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. అందులో స్కూల్స్, హాస్పిటల్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ దాదాపు 500 మందికిపైగా నేవీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పని చేస్తారు.
వీఎల్‌ఎఫ్‌ను వివాదం చేస్తున్నారు… వీఎల్‌ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం…
రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన తర్వాత వికారాబాద్ పూడూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందన్నారు. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్‌ఎఫ్‌ను వివాదం చేస్తున్నారు. వీఎల్‌ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్‌ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణమని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి. 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయని తెలియజేశారు. ’ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగ్గానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించా.. పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా… దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం… దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు.. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు… దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. వీఎల్‌ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు. రాడార్ ఏర్పాటు ప్రాంతంలో గుడికి వచ్చేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వాలని రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. ’ ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా.. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా.. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ భద్రత విషయంలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మన పార్టీలు వేరు కావొచ్చు.. సిద్దాంతాలు వేరు కావొచ్చు. దేశ భద్రత, రక్షణ విషయంలో మేం ఎప్పుడూ విూతో కలిసి వస్తాం. దేశ రక్షణ పరికరాల తయారీలో హైదరాబాద్‌కు మంచి పేరుంది. వీఎల్‌ఎఫ్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం వికారాబాద్ జిల్లా. కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతు న్నారు. దేశ భద్రత ప్రాజెక్టులకు రాజకీయం చేయడం సరికాదు. ఈ ప్రాజెక్టుకు భారాస ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయనివ్వం అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు కూడా పాల్గొన్నారు.