వాస్తవం ప్రధాన ప్రతినిధి- హైదరాబాద్:
మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌పై చేసిన గలీజ్ మాటలపై సర్వత్రా చర్చనీయాంశమవుతున్నది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం సురేఖ మాటల్ని ఖండించింది. కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేసి డిఫెన్స్‌లో పడేయాలని చూసిన కొండాకు ఆ అస్త్రం ఆమెకు తిరిగి బలంగా తాకింది. సమంత, రకుల్‌ప్రీత్ జీవితాలను నాశనం చేశాడనే విధంగా నేరుగా ఆమె హాట్ కామెంట్స్ చేయడం ఈ వివాదానికి కారణమైంది.
అన్నిపేపర్లలో ఈ వార్త ను ప్రధానంగా ప్రచురిస్తే ఈనాడు మాత్రం దీన్ని అసలు పట్టించుకోలేదు. అసలు ఆ విషయమే తమకు తెలియదనే విధంగా ఉన్నారు. నైతిక విలువలకు కట్టుబడే ఇలా చేశామని చెప్పుకొస్తారు కాబోలు. ఏ సర్కార్ వచ్చినా వారికి అనుకూలంగా ఉండటం ఈ మధ్య మీడియాకు అలవాటుగా మారింది. ఇప్పుడిది చేసిందీ అలాంటిదే. అదే బీఆరెస్ అధికారంలో ఉంటే .. కొండా ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఉంటే.. ఈనాడు ప్రధాన వార్తగా కుమ్మేయకపోతుండెనా..? అప్పుడు నైతిక విలువలు అడ్డుకావు కాబోలు. పరిస్తితుల తగ్గట్టు మసలుకోవాలి. అదీ ఇప్పుడు నేర్చుకోవాల్సిన నైతికత.
ఉప సంహరించుకుంటున్న వార్త ఇంటర్నెట్‌లో..
ఉదయం మాత్రం ఈనాడు ఇంటర్నెట్‌లో తన వ్యాఖ్యల్ని ఉప సంహరించుకుంటున్నట్టు వార్త పెట్టింది. ఇంత దుమారం రేగుతుందని ఆమె ఊహించి ఉండదు. కాంగ్రెస్ పెద్దల మందలింపుతో వెంటనే నాలుక్కరుచుకుని క్షమాపణలు కోరింది. తన టార్గెట్ కేసీయారేనని ఒప్పుకుంది. అంటే కేటీఆర్‌ను టార్గెట్ చేసేందుకు ఇలా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుందన్నమాట. సమంత తనకు ఆదర్శమని కూడా చెప్పుకొచ్చింది.