వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌:

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అత్తాపూర్ డివిజన్ హైదర్గూడా వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాలలో, దావత్ లలో మద్యపానాన్నినిషేధిస్తూ తీర్మానించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సమిష్టిగా దావతులలో మద్యపానం జోలికి వెళ్లరాదని , నిర్వాహకులు మద్యం సర్వ్ చేయరాదని శపథం చేశారు.

పెండ్లిల్లు, డిన్నర్ల వంటి శుభకార్యాలలో, లేదా దావత్ లలో బహిరంగంగా మద్యపానం సేవించడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని , యువతరంపై దుష్ప్రభావం చూపుతోందని రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇది సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతోందని వక్తలు అన్నారు. ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లు దావత్ లో మద్యపానం పంపిణీ చేయడం వల్ల ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా అదే దారిలో వెళ్లి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని విచారం వ్యక్తం చేశారు.

బహిరంగ మద్యపాన సేవనం ఏమాత్రం సమంజసం కాదని, నాలుగు గోడలకు పరిమితం కావలసిన పనులు బహిరంగంగా జరగడం వల్ల సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతోందో తెలుసుకోవాలని నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దావతులలో మందు చైతన్య ఉద్యమం అత్తాపూర్ హైదర్ గూడ‌ నుంచి ప్రారంభమైందని, మొదట రంగారెడ్డి జిల్లాలో ఈ నిషేధం అమలుకు ఉద్యమిస్తామని వారు శపథం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు కొలను సుభాష్ రెడ్డి, మేడం రామేశ్వరరావు, నారగూడెం మల్లారెడ్డి, మొండ్ర కొమురయ్య, వనం నరసింహ, సోమవారం రాజ్ కుమార్ ,కార్పొరేటర్ సంగీత, మాజీ కౌన్సిలర్ రవీందర్, రణభక్త సమాజం అధ్యక్షులు మొంద్ర నరసింహ, కోలన్ సుధాకర్, సాబాద విజయ్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed