(దండుగుల శ్రీనివాస్)
ఆమెకు అమ్మంటే ప్రాణం. ఆ అమ్మకు కూతరంటే కన్నతల్లి లెక్క. ఇద్దరి ప్రేమానురాగాలు అలాంటివి. కూతురు అక్రమ కేసులో జైలుపాలయిన తరువాత ఆ కన్నతల్లి మనసు తల్లడిల్లింది. పిల్లలకు దూరమై ఆ కన్నతల్లి జైలులో నరకయాతన పడుతున్న టైంలో ఇక్కడ ఈ మాతృమూర్తి కూతురును తలుచుకుంటూ నిత్యం కన్నీటి పర్యంతమయ్యింది. ఆ ఇద్దరు తల్లీబిడ్డలు కవిత, శోభమ్మల ప్రేమానుబంధం గురించి అందరికీ తెలిసిందే.
అయితే కవిత జైలు నుంచి బెయిల్‌పై విడుదలై వచ్చిన తరువాత కొద్ది రోజులకు ప్రజలతో మమేకమవ్వాలని అనుకున్నదామె. ఓ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నది. ఈనెల 15 అందరినీ కలుద్దామనుకున్నది. కానీ ఈలోగా శోభమ్మ ఆరోగ్యం కొంత బాగాలేకపోవడంతో అప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నది కవిత. జైలులో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. అయినా ప్రజలతో కలుద్దామని భావించినా.. శోభమ్మ ఆరోగ్యంరీత్యా ఆమె వాయిదా వేసుకున్నది.
అమ్మ ఆరోగ్యం కోసం తన ఆరోగ్యాన్నీ లెక్కచేయలేదు. ప్రజలతో కలిసే విషయంలో అమ్మ ఆరోగ్య ఆశీర్వాదాల కోసం చూస్తున్నదా బిడ్డ.