దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ మారలే. అవే అహంకారపు మాటలు. మారని మనిషి చేష్టలు. జనం కర్రుకాల్చి వాతపెట్టినా బుద్ది మాత్రం అట్లనే ఉంది. అది తన ఓటమిగా భావించడం లేదింకా. జనం తెలివిలేని వాళ్లు.. అత్యాశపరులు అంటు ప్రజాతీర్పుపైనే నిందలేసి కాలం గడిపే అధికారదాహంలోనే ఇంకా ఉన్నాడు. రాన్రాను రాజుగుర్రం గాడిదైంది.. అనే సామెత కేసీఆర్‌కు సరిగ్గా నప్పుతుంది. ఇప్పుడు గాడిద, గుర్రం పోలికలెందుకు వచ్చాయంటారా..? ఈ మాటలు కేసీఆర్‌ నోటి వెంటే వచ్చాయి. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ పార్టీలో జాయిన్ అయిన సందర్బంగా ఆయన స్పీచ్‌లో ఇలాంటి ఆణిముత్యాలెన్నో దొర్లాయి. మచ్చుకు కొన్ని ఆయన అహంకారపు మాటలు, చేష్టల గురించే ఈ స్టోరీ.

ఓడింది కూడా మంచిందైందన్నాడు. గాడిదేదో గుర్రమేదో జనాలకు తెలుస్తుందట. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం గాడిదన్నమాట. తాము గుర్రంగా ఆయన అభివర్ణించుకున్నాడు. సరే జనాలు మొదట గుర్రమని తలచే కేసీఆర్‌ ను సీఎం గద్దె మీద కూసోబెట్టారు. ఆ తరువాత ఆ గుర్రం కాస్త గాడిద వేశాలు వేయడం మొదలుపెట్టింది. గాడిదలా ఓండ్ర పెట్టడమూ చేసింది. ఎమ్మెల్యేలు కూగా గాడిద బాటలోనే సాగారు. అంటే.. రాన్రాను రాజుగుర్రం గాడిదైందన్నమాట. అందుకే నువ్వు గుర్రం కాదు.. గాడిదవని జనాలు ఓడగొట్టారు కేసీఆర్‌ను. కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రజాతీర్పు ఆయన కంటికి ఆనడం లేదు. ఛస్‌.. జనాలు ఉత్తి అత్యాశపరులు, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలకు ఆశ పడి గెలిపించుకున్నారంతే..! మనపై వ్యతిరేకతతో కాదు.!!అని కలరింగు కూడా ఇచ్చేసుకుంటున్నాడు ఇలా ఏడ బడితే ఆడ. ఏడ దొరికితే ఆడ.

పనిలో పని నిన్న సందర్బం కాబట్టి దళితబంధు గురించి కూడా తీసిండు. ఇలాంటి పథకం ఆలోచన దేశంలో ఇప్పటి వరకు ఎవ్వడన్నా చేసిండా అని మళ్లీ అవే కోతలరాయుడు కూతలు కూసిండు. దళితబంధు పథకం ఉత్త ఓటు బ్యాంకు పథకమని అందరికీ తెలుసు. దీన్ని ఎవరికి ఇస్తానన్నావ్‌. అర్హత క్రైటేరియా ఏందీ..? దళితులందరికీ ఇస్తాడంట. అందులో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా. ఎప్పటి వరకు ఇస్తావు..? నువ్వెన్నేండ్లుంటావు..? బడ్జెట్‌ ఎంత..? అవేమీ లెక్కలు లేవు. జాతీయ పార్టీ పెట్టిన కాబట్టి దేశంలో ఏదో ఒకటి తన గొప్ప చెప్పుకోవాలె. ఇక్కడ దళితుల ఓట్లు కొల్లగొట్టాలె. అదే నీ ప్లాన్‌. దీనికి కొండంతరాగం తీసిండు కేసీఆర్.

వినేవాడుంటే కేసీఆర్‌ ఎప్పుడు లోకువే. ఇలా చెప్తూ పోతుంటడు. రైతుబంధు కూడా రాళ్లకు రప్పలకు బలిసిన రెడ్లకు, వందల ఎకరాల ఆసాములకు ఎందుకిచ్చినవు.. ఇది ఓటు బ్యాంకు రాజకీయం కాదా..? తుగ్లక్‌ వేశాలు, ఆలోచనలతోనే నీకు ఈ గతి పట్టింది అని ఎవరన్నా చెప్పినా కేసీఆర్ ఒప్పుకోడు. ఎవడ్రా ఆడోడు ఈడోడు మోపైనాడు అంటాడే తప్ప. తన తప్పులు మాత్రం జన్మలో కూడా తెలుసుకోడు. చెంపలేసుకోడు. మారడు. జనాలు కూడా మారరు. ఇలాంటి తీర్పులే ఇస్తుంటారు. కర్రు కాల్చి వాతలు పెడుతుంటరు.

Dandugula Srinivas

Senior Journalist

8096677451

You missed