టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్ షోలో ప్రచార రథనం నుండి పడ్డ ఘటనలో దాదాపుగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానిక అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి, ఇతర స్థానిక నేతలతో కలిసి ప్రచార రథంపై వెళ్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం పైన రెయిలింగ్ ఊడిపోయి కేటీఆర్ వ్యాను పైనుండి బ్యానట్ పైనకి బోర్లా పడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే స్పందించి కేటీఆర్ ను పట్టుకోవడంతో ఆయన నేరుగా భూమిని తలభాగంలో ఢీకొట్టే ప్రమాదం తప్పింది. ఈ ప్రమాద వార్త రాష్ట్ర, జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో దావాణంలో వ్యాపించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పరిస్థితి ఎలా ఉందో అని కొంత ఆందోళన నెలకొంది. కానీ కేటీఆర్ తాను ప్రాణాపాయం నుండి బయటపడ్డాను అన్న ఆలోచన కూడా దరిచేరనీయలేదు. వెంటనే తనతో పాటు వ్యాన్ పైనుండి పడ్డ వారి పరిస్థితిని అడిగి.. వెంటనే తాను వచ్చిన పనిలో లీనం అయిపోయారు. ఆర్మూర్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తున్నంసేపు ఎక్కడ ఆయన ముఖకవళికల్లో గాని, ప్రసంగంలో గాని ప్రమాదం జరిగిందన్న ఛాయలే కనబడలేదు. ఆర్మూర్ లో ముగించుకొని వెంటనే కొడంగల్ బయలుదేరి అక్కడ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొని తన కర్తవ్య బాధ్యతను పూర్తి చేశారు. దీంతో కెసిఆర్ పై పార్టీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నాయి. కేటీఆర్ స్ట్రాంగ్ మైండెడ్ అనడానికి ఈ సందర్భం బెస్ట్ ఎగ్జాంపుల్ అని అభిమానులు, కార్యకర్తలు కొనియాడుతున్నారు.