తను అధికారంలోకి రాగానే ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని చెప్పిన అర్వింద్‌ బాండు పేపర్‌ ఉత్తి మాటల తప్పుడు హామీల పథకాలే కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ పథకాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు హైకమాండ్‌ ఢిల్లీ వయా బెంగుళూరు అయితే, ఇక్కడి బీజేపీకి హైకమాండ్‌ ఢిల్లీ వయా గుజరాత్‌ అని అని ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్‌కు హైకమాండ్‌ తెలంగాణ ప్రజలేనని, వారికి ఏం కావాలో అదే చేసి చూపిస్తారని, అనుకున్నది చేసేందుకు ఆయన ఎవరినో అడగాల్సిన పనిలేదని, ప్రజల ఆభీష్టాలే ఆయన పథకాలని మంత్రి ఉద్ఘాటించారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌కు తోడుగా నిలబడాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. మళ్లీ మూడోసారి కూడా బీఆరెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు టర్మ్‌ లలో కోట్లాది రూపాయలు అన్ని రంగాల అభివృధ్ది, సబ్బండవర్ణాల సంక్షేమానికి కృషి చేశామని, మళ్లీ అధికారంలోకి రాగానే ప్రధాన రంగాలైన విద్యా, వైద్యం, ఉద్యోగాలపై మరింత ప్రధానమైన దృష్టిని కేసీఆర్‌ కేంద్రీకరించనున్నారని ఆయన తెలిపారు.

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్,పడగల్ గ్రామాల్లో సుమారు 17 కోట్ల విలువగల పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం శంకుస్ధాపనలు చేశారు.

 

సొంత జాగ ఉండి ఇండ్లు లేని అర్హులైన పేదలకు విడతల వారీగా,నిరంతరాయంగా గృహ లక్ష్మి కింద 3లక్షలు ఇస్తామని వెల్లడించారు. కేసిఆర్ తోనే తెలంగాణ పల్లెల్లో అసాధారణ అభివృద్ది సాధ్యమయ్యిందని,కాళేశ్వరం నీళ్లతో ఊర చెరువులు కళకళ లాడుతున్నాయని అన్నారు.అభివృద్ధి,పాడి పంటలు,కుల వృత్తులకు చేయూతతో గ్రామాలు సంబురంగా మారాయన్నారు.కెసిఆర్ సంపద సృష్టించి..పేదలకు పంచుతున్నాడన్నారు. 36 వేల కోట్ల రైతు రుణమాఫి ఘనత ఒక్క కేసిఆర్ కే దక్కుతుందని, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత సాహసం చేయలేదని అన్నారు. రైతు బంధు లాంటి పథకంతో రైతులకు ఆర్ధిక భరోసా ఇయ్యాలన్న కనీస ఆలోచన ఏ నాయకుడు చేయలేదన్నారు. కానీ ఇప్పుడు మేము కేసిఆర్ కంటే ఎక్కువ చేస్తామని అర్రాసు పాట తీరుగా పథకాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ వి గట్టి చేతలు..కాంగ్రెస్ వి ఉట్టి మాటలని,రామ – రావణ యుద్ధంలో మిగిలిన రాక్షసులు కొంత మంది మనిషి రూపంలో గ్రామాల్లో ఇంకా తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల కథ కూడా ఎంపి అర్వింద్ బాండ్ పేపర్ లాంటి ఉత్తి మాటే అని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ కు హైకమాండ్ ఢిల్లీ వయా బెంగుళూరు అయితే,బీజేపీ కి హైకమాండ్ ఢిల్లీ వయా గుజరాత్ అని అన్నారు. కానీ కేసిఆర్ కు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని స్పష్టం చేశారు.తెలంగాణ బిడ్డ కేసిఆర్ కు తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పారు. ఓట్ల కోసం మాయమాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని,గోస పడ్డ జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కు తోడుగా నిలబడాలని మంత్రి వేముల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,ఆర్డీవో వినోద్ కుమార్, ఏసిపి జగదీష్ చందర్,పలువురు మండల బిఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 

You missed