మంత్రి ప్రశాంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడని, కానీ ఒక్క పని కూడా తన సొంత పని చేసుకోడని, ఆ ఆలోచనలు కూడా చేయడని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ఎల్లప్పుడు తన నియోజకవర్గం బాల్కొండ అభివృద్ధి కోసం తపించే తత్వం ఉన్న నాయకుడు ప్రశాంత్‌రెడ్డి అని, అందుకే ఇక్కడ ఇంతలా అభివృద్ధి జరిగిందన్నారాయన. భీంగల్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన భీంగల్ ఆర్టీసీ బస్ డిపోను ఆదివారం పునః ప్రారంభించారు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్…ఈ సందర్బంగా డిపో బస్సును జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోవర్దన్ మాట్లాడుతూ.. 14 సంవత్సరాల క్రితం మూత పడ్డ బస్ డిపో మళ్లీ ప్రారంభించు కున్నామని, 22 బస్ లను భీమ్ గల్ కు కేటయించుకున్నామన్నారు. భీమ్ గల్ నుండి తిరుపతి కి కూడా బస్ లను ప్రారంభిస్తామన్నారు. ప్రజలు ఆర్టీసీ నీ ఆదరించాలని కోరారు. ఆర్టీసీ నీ బతికించే0దుకు సీఎం కేసీఆర్ విశేషం గా కృషి చేశారని, చివరికి ఆర్టీసీ నీ ప్రభుత్వం లో విలీనం చేసి 43 వేల కుటుంబాలకు సీఎం కేసీఆర్ దేవుడు అయ్యారయ్యారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్షాలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నాయని, మత విద్వేషాలు రెచ్చగొట్టి బిజెపి ప్రయోజనం పొందాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఓట్లు దండు కొని బయట పడేవారీ మాటలు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు బాజిరెడ్డి.
మీ ఎత్తులకు నా మంత్రం మూడింతల అభివృద్ధి : ప్రశాంత్‌రెడ్డి
ప్రతిపక్షాలు తనను ఓడించేందుకు ఎన్ని ఎత్తులు వేసినా, మరెన్ని ఆరోపణలు చేసినా తను తిరిగి సమాధానంగా విమర్శలు చేయనని, మూడింతల అభివృద్ధి చేసి మూతోడ్ జవాబ్ ఇస్తానని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి సహకారం తో భీమ్ గల్ బస్ డిపో ను పున ప్రారంభించుకున్నామన్నారు. హైదరాబాద్ లో సి డబ్లు సి మీటింగ్ పెట్టీ పనికి మాలిన హామీలు ఇస్తున్నారని, పెన్షన్ లు పెంచుతాం, రెండు లక్షల ఋణమాఫీ చేస్తాం అంటూ బూటకపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. అమలుకు నోచుకోని,ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరిపోడన్నారు. కిషన్‌రెడ్డి ఢిల్లీ బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే నాయకుడని ఎద్దేవా చేశారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీయారే శ్రీరామ రక్ష అని, ప్రజలు వాస్తవాలు గమనించాలన్నారు .పనిచేసే బి అర్ ఎస్ పార్టీకి మరోసారి పట్టం కట్టండని కోరారు.