ఎస్సారెస్పీలోకి వరదరాక కొనసాగుతున్నది. ఆ వరద రాక, దాని ఉదృతి పగటికి రాత్రికి మారిపోతూ ఉన్నది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టు లోకి అటు ఇటుగా నిలకడగా కొనసాగిన వరద గురువారం అర్ధరాత్రి కి ముందు పెరిగింది. 59 వేల క్యూసెక్కుల నుంచి 71 వేల 508 క్యూసెక్కులకు పెరగడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సారెస్పీ అధికారులు అర్ధరాత్రికి ముందు 20 గేట్లను ఎత్తి 62,440 కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు.
71,558 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా ఇందులో 62,440 క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నవి కాగా, జెన్కోకు 8000, మిషన్ భగీరథకు 152 క్యూసెక్కు లు వదులుతున్నారు. 666 క్యూసెక్కుల వాటర్ ఆవిరిగా వెళ్ళిపోతున్నది.