ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ అనే పేరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిందేమి కాదు. ఇదే మాట ఆయన వద్ద
అంటే అందులో తనను ఆశీర్వదించిన వారి గొప్పతనమే లేకుంటే తన పేరు ఎక్కడిది అని మనసు లోతుల్లోంచి వెంటనే చెప్పేసే దివ్య లక్షణమున్న నాయకుడు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డి. రాజేశ్వర్.

తన అభిరుచి ప్రకారం సేవారంగాన్ని ఎంచుకొని అందులో తన వారికోసం తనకున్న అవకాశాలను అందరూ తన వారే .. తన వారు అందరి వారే అనే పంథా ను నమ్మి ముందుకు నడుస్తూ 1987 లో నిజామాబాద్ లో అన్ని వర్గాలు ఆయన మంచితనానికి ఓటేసి ఆశీర్వదించడంతో కౌన్సిలర్ గా ఆయన ప్రజా ప్రాతినిధ్య రాజకీయ పయనం మొదలైంది. అనంతరం ఆయనకు జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. గెలుపు ఆశీర్వాదం ఆయనకు లభించలేదు. అందరిలా ఆగిపోలేదు ఆయన. తాను మొదలెట్టిన తన మొదటి లక్ష్యాన్ని తిరిగి నమ్ముకున్నాడు. అందుకు ఆయనకు ముగ్గురు ముఖ్యమంత్రుల ఆశీర్వాదం దొరికింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఈ ఆశీర్వాదం ఆయనకు అవకాశం కల్పించింది.

అప్పటివరకు తన వారి కోసం.. తాను నమ్ముకున్న పార్టీ ఇచ్చిన అవకాశాలు వేరు. అప్పటి వరకు ఆయనపై ప్రేమ ఉన్న వర్గాలు ఆయనతో నడిచాయి. అటు తర్వాత ఉద్యమ సినిమా తెలంగాణలో ప్రారంభమైంది. తెలంగాణ వచ్చింది. అప్పటిదాకా ఆయన కొనసాగిన పార్టీలను ప్రజలు ఆయనతో పోల్చి చూడలేదు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే తనకంటే ముందు ముగ్గురు సీఎంల ఆశీర్వాదం ఉన్న నాయకుడిగా రాజేశ్వర్ ను టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చూడలేదు. రాజేశ్వర్ లో మంచితనాన్ని, మంచి చేసిన వారిని మంచిగా ఉంచాలని దైవాన్ని త్రికరణ శుద్ధిగా ప్రార్థించే ఆయన మనస్తత్వాన్ని గుర్తించి రాజేశ్వర్ ముందుకు సాగేలా కెసిఆర్ వెన్ను తట్టారు.

మరి రాజేశ్వర్ ఏం చేశాడంటే తనకు ఉన్న సహజ సిద్ధ క్యారెక్టర్ నే కొనసాగించాడు. ఇక్కడ కూడా తనకు లభించిన ఆశీర్వాదం.. తెలంగాణ రాష్ట్రంలో తన వారికి కూడా అందాలని బలంగా కోరుకున్నాడు. ఎక్కడా తగ్గలేదు. స్వరాష్ట్రం వచ్చాక అందుతున్న ప్రయోజనాలు.. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అందుకోలేకపోయిన విషయాలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ నిర్మొహమాటంగా చెబుతూ వచ్చారు. రాజేశ్వర్ నిజాయితీని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చింది కేసీఆర్ పరిశీలన దృక్పథం. ఆ దృక్పథాన్ని నేరుగా తెలంగాణ వచ్చాక రాజేశ్వర్ కు ఎమ్మెల్సీ పదవితో గౌరవంగా అందించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇప్పుడు మరోసారి ఇంటి బిడ్డలకు ఇంట్లో ఉన్నది సందర్బోచితంగా అందించే కొంత ఇబ్బందికర సందర్భం వచ్చినా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మతో సమన్వయం చేసుకొని మరోసారి డీ రాజేశ్వర్ కు న్యాయం చేశారు.

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి గౌరవంగా అందించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రాజేశ్వర్ నిజాయితీ నిబద్ధత ఉంది. కార్పొరేటర్ నుంచి క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దళిత వర్గాల నేతలకు టిఆర్ఎస్ ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనంగా రాజేశ్వర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవాన్ని కొనసాగించిన గులాబీ పార్టీ ఘనత ఉంది.36 సంవత్సరాలు తాను చూసిన రాజకీయాల్లో మొదట దక్కిన పదవులు ఒక కారణం వల్ల అయితే.. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ తన గౌరవాన్ని గుర్తించి పదవి ఇచ్చిందని.. గతంలో కంటే తన వారికి ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే అవకాశం కల్పించిందని రాజేశ్వర్ ఖుల్లామ్ ఖుల్లా స్పష్టం చేస్తున్నారు. రక రకాల అనివార్య కారణాలు కొందరు ముఖ్య నేతలకు పదవుల రాకకు కారణమవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో సైతం కల్వకుంట్ల కవితమ్మ ఆశీర్వాదంతో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తనకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశాన్ని కల్పించాలని అదే ఫుల్ చిరునవ్వుతో.. ఆయన కన్నుల్లో కనిపించే అదే కృతజ్ఞతతో చెబుతూనే ఉన్నారు. అదే రాజేశ్వరరావు నిజాయితీ.

You missed