బాల్కొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులకు రాష్ట్ర ఆర్ & బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి భారీ జాబ్ న్యూస్ అందించారు. 70 కి పైబడి కంపెనీలు..4000 కు పైగా ఉద్యోగాలు కల్పించేలా ఈనెల 12వ తారీఖున నియోజకవర్గంలోని వేల్పూరు మండలం లక్కోరాలో 63వ నంబరు జాతీయ రహదారి పక్కనే గల ఏ ఎన్ జి ఫంక్షన్ హాలులో మెగా జాబ్ మేళాను మంత్రి కృషి, ప్రత్యేక చొరవతో జరగనుంది.

యువతకు సమాచారం కోసం వాస్తవం డిజిటల్ న్యూస్ పేపర్లో, సామాజిక మాధ్యమాల్లో ఉంచిన ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ లో ఉన్న క్యూఆర్ ను స్కాన్ చేసి గాని, లింక్ ద్వారా గాని నిరుద్యోగ యువత ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. 12వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో ఏఎన్జీ ఫంక్షన్ హాల్ లో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంఫార్మా, బీఫార్మ, ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఏదేని పీజీ, ఏదేని డిగ్రీ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి ఉత్తీర్ణులైన వారు జాబ్ మేళాకు హాజరు కావచ్చని తెలిపారు.

You missed