కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో గంప కుమారుడి వివాహానికి సీఎంతో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన కూడా గంప నియోజకవర్గానికి పెద్దగా టైమ్‌ కేటాయించలేకపోయాడు. కుమారుడి పెళ్లి ఏర్పాటులో హడావుడిగా ఉండటంతో మధ్యలో ఎమ్మెల్సీ కవితతో కలిసి ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి ఆ తర్వాత మళ్లీ ఇటువైపు రాలేదు.

మంగళవారం రిసిప్షన్‌. ఆ తర్వాత మరో మూడు నాలుగు రోజులూ గంప బిజీబిజీయే. అంటే దాదాపు పది తారీఖు వరకు ఇదే సందడిలో బిజీగా ఉండే అవకాశం ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గంప బిజీగా ఉండటంతో ఆమె వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ లోపు కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌ అలీ, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిలు అక్కడ హల్‌చల్‌ చేస్తూ జనాన్ని తమ వైపునకు తిప్పుకునే పనిలో బిజీ అయ్యారు.

You missed