బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్‌ సత్యప్రకాశ్‌కు నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా నియమించేందుకు అధిష్టానం రూట్ క్లియ్‌ర్ చేసిందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. సత్య ప్రకాశ్‌ను చైర్మన్‌ చేయాలని కోరుతూ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా సీఎంకు తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం వద్ద ఉంది. నేడో రేపో దీనిపై సీఎం ఆమోద ముద్ర వేయడమే తరువాయిగా ఉందని విశ్వసనీయవర్గాలు చెప్పుకుంటున్నాయి.

You missed