నేడో రేపో ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాను బీఆరెస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ విడుదల చేస్తాడనే వార్తల ఊహాగానాల నేపథ్యంలో… జిల్లాపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకే జిల్లాలోని ఐదు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్‌ ఆమె భుజస్కంధాలపై మోపాడు. దీంతో ఆమె బోధన్‌ నుంచి ప్రచార శంఖారావాన్ని పూరించారు. కాగా జిల్లాలోని ఐదు సిట్టింగు ఎమ్మెల్యేలకే ఈసారి కూడా అవకాశం దొరకుతుందని విశ్వసనీయంగా తెలిసింది.ఇందూరు సిట్టింగుల ఫైనల్‌ జాబితా అధినేత వద్ద రెడీగా ఉంది. బాల్కొండ నుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డి గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేపట్టాడు.

పెద్ద నియోజకవర్గం అయినా తన పరపతిని ఉపయోగించి, సీఎంతో ఉన్న సాన్నిహిత్యాన్ని సమయానుకూలంగా నియోజకవర్గానికి మేలు చేసేలా ఆయన అడుగులు వేశారు. అది చేసి చూపించారు. దీంతో ప్రతిపక్షాలు ఆయన కనుచూపు మేరలోకి కూడా పోటీకి సిద్దంగా ఉన్నట్టు కనబడటం లేదు. ఇప్పటికే ఉన్నవారిలో అంత బలమైన అభ్యర్థులుగా ప్రజలు భావించడం లేదు. ఇక ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్నారు. టికెట్‌ కన్ఫామని, మూడోసారి తనే గెలవబోతున్నట్టు కూడా ప్రచార సభల్లో ప్రకటించుకుంటున్నారు.

వాస్తవంగా అందరికంటే ప్రచారంలో జీవన్‌రెడ్డే ముందు వరుసలో ఉన్నాడు. ఇక అర్బన్‌ బిగాల గణేశ్‌గుప్తా విషయానికొస్తే… మొన్న మంత్రి కేటీఆర్‌ వచ్చి అర్బన్‌ ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. ఇంతలా అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు దొరకడం మీ అదృష్టమంటూనే 55వేల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేయడంతో ఆయన టికెట్‌ కన్ఫాం అయిపోయింది. బోధన్‌లో షకీల్‌కు కలిసివచ్చేది ఒకే ఒక అంశం.. మైనార్టీ కార్డు. దీనికి తోడు అక్కడ ప్రతిపక్షం బలంగా లేదు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిని అవుట్‌ డేటెడ్‌ లీడర్‌గా చూస్తున్నారు. బీజేపీలో అభ్యర్థి ఎవరో తెలియదు. దీంతో షకీల్‌ అక్కడ తిరుగులేదు.

కవిత ప్రోగ్రాం,ర్యాలీ , పాదయాత్ర తర్వాత అక్కడ సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. షకల్‌కు అనుకూలంగా పవనాలు వీస్తున్నాయి. నిజామాబాద్‌ రూరల్‌నియోజకవర్గంది ప్రత్యేక పరిస్థితి. ఈసారి బాజిరెడ్డి గోవర్దన్‌ తనకు కాకుండా కుమారుడు బాజిరెడ్డి జగన్‌కు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది అధిష్టానం పరిగణలోకి తీసుకున్నది. అయితే ప్రకటించే వరకు కూడా సస్పెన్స్‌ కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ.ఉత్కంఠ. ఇక్కడ కూడాప ప్రతిపక్షాలు బలంగా లేవు. నేనంటే నేను అనే రీతిలో టికెట్ల కోసం తన్నుకుంటున్నారే తప్ప బలమైన ప్రత్యర్థి నేను అనే చెప్పే ధైర్యం లేదు.. అధిష్టానం ప్రటించేందుకు సాహసించడం లేదు. దీంతో రూరల్‌ నియోజకవర్గం గెలుపు బాజిరెడ్డికి నల్లేరు మీద నడకే కానుంది.

కానీ ఆయన అంతరాత్మ కొడుకు కోసం కొట్టుకుంటున్నది. కుమారుడికి టికెట్‌ ఇప్పించుకుని గెలిపించుకుంటానని కేసీఆర్‌కు పలుమార్లు చెప్పాడు బాజిరెడ్డి, కవిత, కేటీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డిలతో కూడా చాలా సార్లు చర్చించాడు. దీన్ని స్పెషల్‌ కేటగిరీ కింద తీసుకుని జగన్‌కు టికెట్‌ ఇవ్వాలనే ఆలోచన చేస్తాడా..? వేచి చూడాలి. జగన్‌ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి తరహాలో తను కూడా నియోజకవర్గంలో దూకుడుగా కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నాడు. అధిష్టానం దృష్టిలో పడుతున్నాడు. ఏమి జరగుతుందనే విషయం మాత్రం తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతుండగా.. ఎవరికిచ్చినా భారీ మెజారిటీతో బాజిరెడ్డి, ఆయన కుమారుడిని గెలిపించుకుంటామని చెబుతున్నాయి రూరల్‌ బీఆరెస్‌ శ్రేణులు.

You missed