మంత్రి కేటీఆర్ స్వల్పంగా అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. సోమవారం ఆయన కామారెడ్డి టూర్‌కు వచ్చారు. కామారెడ్డి పట్టణంలో పలు ప్రారంభోత్సవాలతో పాటు.. ఎల్లారెడ్డిలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయన కామారెడ్డికి చేరుకోగానే కొంత ఆరోగ్యం నలతగా ఉన్నట్టుగా బీఆరెస్ శ్రేణలకు తెలియజేసినట్టు తెలిసింది. రాగానే ప్రారంభోత్సవాల్లో పాల్గొనకుండా కొంత సమయంల ఆయన గెస్ట్ హౌస్‌లో రెస్ట్ తీసుకున్నారు. ఆయన ఆరోగ్యం కొంత అస్వస్థతకు గురైన కారణంగా ప్రోగ్రాంలో పలు మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.