జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌రావు వైఖరికి నిరసనగా మొన్న జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బైకాట్‌ చేసి నిరసన తెలిపిన సంఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పటీసీలను, పీఆర్‌ శాఖ ఇంజీనిర్లను, సీఈవో తదితరులను తన వద్దకు పిలిపించుకున్నాడు. జడ్పీ సీఈవో గొవింద్‌ వైఖరిపై మంత్రి మండిపడ్డారు. ఎప్పటికప్పడు తగిన సమాచారం ఇవ్వడంలో విఫలమైన సీఈవో తన వైఖరి మార్చుకోకపోతే కష్టమని తేల్చి చెప్పాడు మంత్రి. సీసీ మహేశ్‌ మూలంగా చైర్మన్‌కు సభ్యులకు మధ్య ఆగాధం ఏర్పడుతుందనే వాదనను విన్న మంత్రి సీసీని మార్చేయండని ఆదేశం జారీ చేసినట్టుగా తెలిసింది. పంచాయతీ రాజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజినీర్లు సివిల్‌ వర్కులకు జడ్పీటీసీల వద్ద కమిషన్లు అడుగుతున్నారనే సమాచారంతో మంత్రి వేముల మండిపడ్డారు. కమీషన్లు, పర్సెంటీజీలు అడిగినట్టు తెలస్తే బాగుండదని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. ఏదైనా ఉంటే తన వద్దకు వచ్చి మాట్లాడాలని రచ్చకెక్కి రాజకీయాలకు చేయవద్దని జడ్పీటీసీలకు హితవు పలికనట్టు తెలిసింది.

You missed