ఎప్పటి నుంచి ఎన్నో కోరికలు, డిమాండ్లు. ఎవరికి చెప్పినా పెద్దగా స్పందన లేదు. ఇక లాభం లేదనుకుని టీఎన్జీవోలు తమే ఓ అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నారు. పలు డిమాండ్ల కోసం, హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పలు తీర్మనాలు చేశారు. సమిష్టిగా ఒక పోరాటానికి సన్నద్దం కావాలని కూడా పిలుపునివ్వడం గమనార్హం. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న టీఎన్‌జీవో ఉద్యోగులు ఇక తమ నిరసన గళాన్ని విప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హక్కులు సాధించుకోవాలని తీర్మానించుకున్నారు.

శనివారం టిఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్‌,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ అధ్యక్షతన, ఏర్పాటు చేసిన టీఎన్జీవో అత్యవసర జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎజెండా అంశాలపై సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలను తెలియచేశారు. అనంతరం జిల్లా చైర్మన్ పలు డిమాండ్లను, హక్కులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వీటి సాధన కోసం పోరాటాలకు సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు.

ఇవీ ఎజెండా అంశాలు..

– రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 01.07.2023 మధ్యంతర భృతితో తో పాటు రావాల్సిన నూతన రెండవ పిఆర్సి అమలు చేసే వరకు ఉద్యోగులందరం ఐక్యంగా ఉండి పోరాడాలి.

– ఉద్యోగుల హెల్త్ స్కీం (EHS)ను పటిష్టంగా అమలు చేయుటకు చెందాతో కూడిన హెల్త్ స్కీమ్ అమలు చేసి ఉద్యోగులందరికీ నాణ్యమైన చికిత్స నిమిత్తం కార్పొరేట్ ఆసుపత్రిలో నాణ్యమైన చికిత్స అందించేందుకు పటిష్టమైన హెల్త్ స్కీమును అమలు చేయాలని

– 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులందరికీ గుదిబండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (CPS) విధానాన్ని వెంటనే రద్దుచేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పాత పెన్షన్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
“CPS అంతం టీఎన్జీవోల పంతం” నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలి.

టీఎన్జీవో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం త్వరలో నిర్వహిస్తామని, ఉద్యోగులందరూ సమిష్టిగా మన హక్కుల సాధన కొరకై ఐక్యంగా పోరాడుటకు సన్నద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని ఈ సందర్బంగా అలుక కిషన్‌ తెలియజేశారు.

అనంతరం టీఎన్జీవో జిల్లా కార్యదర్శిగా 6వసంతాలకు పైగా అత్యున్నత సేవలు అందించి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన టీఎన్జీవో జిల్లా మాజీ జిల్లా కార్యదర్శి సంఘం అమృత్ కుమార్ సేవలను కొనియాడుతూ టీఎన్జీవో పక్షాన ఘనంగా సన్మానించి, మెమొంటో మరియు అభినందన సన్మాన పత్రంచే సత్కరించారు. కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి ,సలహాదారులు ఆకుల ప్రసాద్ ,కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, M.సతీష్ కుమార్, కోశాధికారి గంధం వెంకటేశ్వర్లు అన్ని యూనిట్ శాఖల అధ్యక్ష, కార్యదర్శులు సుమన్, జాకీర్ హుస్సేన్, దినేష్ బాబు, మహేందర్, రమేష్, జనార్దన్, సూర్య ప్రకాష్, సతీష్, నాగరాజు గోవర్ధనస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, పురుషోత్తం, కెపి సునీత, వసుమతి దేవి, మంజుల విజయలక్ష్మి ఇందిరా గీతారెడ్డి సత్యం, జాఫర్ హుస్సేన్, అతిక్ తదితరులు పాల్గొన్నారు.

You missed