ఊహించిందే జరిగింది. గవర్నర్‌ కోటాలో మనోళ్లకు స్థానం దక్కలేదు. రెండు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణకు ఇస్తూ కేసీఆర్‌ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాడు. దీంతో దీనిపై ప్రధానంగా గంపెడాశలు పెట్టుకున్న మధుశేఖర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. ఇప్పుడు మధుశేఖర్‌ పార్టీలో ఉంటాడా…? తన దారి తను చూసుకుంటాడా..? కొద్ది రోజుల్లో తేలనుంది. అతను ఆర్మూర్ నుంచి పోటీకి రెడీగా ఉన్నాడు. దీంతో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. మరోవైపు రాజేశ్వర్‌ తనకు మళ్లీ రెన్యూవల్ చేస్తారని భావించి ప్రయత్నాలు చేశాడు.

కానీ దక్కలేదు. వీరితో పాటు వీజీ గౌడ్‌, ఆకుల లలిత, ఈగ గంగారెడ్డి తదితరులు కూడా ఎమ్మెల్సీ పై ఆశలు పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్టుగానే జిల్లాకు కేసీఆర్‌ మొండిచేయే చూపాడు.

You missed