వర్షాలు తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీలోకి వరద ఉద్ధృతి రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చినా.. వరద రాకలో గంట గంటకు, నాలుగైదు గంటల్లోనే హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి.

ఆదివారం ఉదయం తర్వాత రాత్రి వరకు 8100 క్యూసెక్కుల వరదరాక, వరద విడుదల పరిస్థితి కొనసాగింది. ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత మళ్లీ ఎస్సారెస్పీ లోకి వరద ఉధృతి పెరిగింది. 53 వేల ఒక 100 క్యూసెక్కులకు వరదరాక పెరిగింది. దీంతో మూడు రోజుల తర్వాత మళ్లీ 16 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు . ఆదివారం అర్ధరాత్రి దాటాక 16 గేట్ల ద్వారా 52,000 584 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా అంతే మొత్తం లో ఔట్ ఫ్లో కొనసాగుతున్నది.

You missed