శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గిపోయింది. ఆదివారం ఉదయం 54 వేల 694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగి క్రమంగా.. గణనీయంగా 8100 క్యూసెక్కులకు తగ్గి పోయింది. ఆదివారం సాయంత్రం వరకు కూడా ప్రాజెక్టులోకి 8 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లోనే కొనసాగింది.

ఔట్ ఫ్లో కూడా 8100 క్యూసెక్కులు గానే కొనసాగిస్తున్నారు. ఇందులో ఎనిమిది వేల క్యూసెక్కులు ఎస్కేప్ గేట్లు, జెన్ కో ద్వారా విడుదల చేస్తుండగా 100 క్యూసెక్కులు లక్ష్మీ కాల్వకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 1091 అడుగులు, 90.313 టిఎంసిలు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టులో 1090 అడుగుల నీటిమట్టం, 84.81 టిఎంసిల నీటి నిలువ ఉంది. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారిపోయింది. గత సంవత్సరం ఇదే రోజున ఉదయం ఆరు గంటలకి ప్రాజెక్టులో ఒక 1087 అడుగుల నీటిమట్టం, 75. 465 టిఎంసిల నీరు ఉంది.

You missed