శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు ఇన్ ఫ్లో తగ్గడంతో 18 గేట్ల ద్వారా 58 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90.3 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టు ఒక 1089 అడుగుల నీటిమట్టానికి, 81. 696 టిఎంసీల నీటి నిల్వకు చేరుకున్నది. గత సంవత్సరం ఇదే రోజున ఉదయం ఆరు గంటలకు ప్రాజెక్టులో 1087.50 అడుగుల నీటిమట్టం, 74. 8 2 6 టీఎంసీల నీరు ఉంది.

ఈ ఏడాది జూన్ 1న ప్రాజెక్టులో 21.064 టీఎంసీల నీటి నిలువ ఉండగా ఆ రోజు నుండి నేటి వరకు 76.044 వరద వచ్చి చేరింది. అందులోంచి ఇప్పటివరకు 18. 466 టిఎంసిల అవుట్ లో నమోదయింది.

You missed