అర్వింద్‌కు అక్క భయం.. కవిత యాక్టివ్‌ పాలిటిక్స్‌తో బెంబేలు… మళ్లీ లిక్కర్‌ కేసును బూచీగా చూపే యత్నం.. డీలా పడిన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు… ఎంత లేట్‌ అయితే అంత గట్టిగా కేసు ఉంటుందని పరోక్షంగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం పేరును వాడుకునే కుటిలయత్నం…. కాంగ్రెస్‌ పుంజుకోవడం.. బీజేపీ డీలా పడటం.. బీఆరెస్‌లో కవిత దూకుడు….. జీర్ణించుకోలేకపోతున్న అర్వింద్‌..

అర్వింద్‌ది అదే అజ్ఞాన ప్రదర్శన… పసుపుబోర్డు తేలేని అసమర్థతను ప్రభుత్వంపైకి నెట్టి… నిలువ చేసుకునే గోదాములులేకే గిట్టుబాటు ధర రాలేదన్న అర్వింద్‌.. మొన్నటి వరకు ఆరు వేలకు అమ్ముకున్నారని ఒప్పుకున్న ఎంపీ… రీజనల్ ఆఫీసు ఏర్పాటు చేసి ఏం చేశాడో..? పసుపు రైతులను మరోసారి మోసం చేసేలా మాటలు… ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌పైనా అవే అవగాహన రాహిత్య సొల్లు మాటలు… ఇంకా తుకాలే వేసుకోలేదు.. నాట్లు వేసుకుని ఎండిపోతున్నాయని కామెంట్‌.. రివర్స్‌ పంపింగ్ వల్ల ఉపయోగం లేదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు… కడ్తా పేరుతో స్కాం చేస్తుందని‌.. రైస్‌మిల్లర్ల దోపిడీని పరోక్షంగా ఒప్పుకున్న అర్వింద్‌… ఈథనిల్‌ ఫ్యాక్టరీలు పెట్టొచ్చు కదా అని నిలదీసిన అర్వింద్‌… తను గతంలో ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మరిచిన వైనం…

You missed