వీసీ కాదు అతనో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి…

కోట్లకు పడగలెత్తిన రవీందర్‌ గుప్తా….

తవ్విన కొద్దీ ఆస్తులు… ఏసీబీ సోదాల్లో విస్తుపోయే వాస్తవాలు…

వందల కోట్ల ఆస్తులు…. బయటపడ్డ వీసీ నిజస్వరూపం…

ఆర్మూర్‌ నరేంద్ర కాలేజీ నుంచి 50 వేలు తీసుకుంటూ పట్టబడి… జైలుకు…

సోమవారం కొత్త వీసీ నియామకం…

ఏసీబీకి దొరకకపోతే… ఇంకా బర్తరఫ్‌ కేసు గవర్నర్‌ దగ్గరే పెండింగ్‌..?

రవీందర్‌ గుప్తా… అందరికీ తెలిసి అతనో వీసీ. అదీ తెలంగాణ యూనివర్సిటీకి. కానీ తెరవెనుక ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి. కోట్లకు పడగలెత్తాడు. ఎంతంటే వందల కోట్లు. లెక్క తీసేందుకు ఇప్పుడు ఏసీబీ తంటాలు పడుతున్నది గంటల తరబడి. బహుశా అది రోజుల తరబడీ కావొచ్చు. విజయవాడ హైవోలో వందల ఎకరాల ఆసామి. వందల కోట్లు రియల్ వ్యాపారంలో సంసాదనకు మరిగాడు. ఇక్కడా వీసీ వేషంలో అదే చేశాడు. చివరకు ఆర్మూర్‌ నరేంద్ర కాలేజీ ప్రిన్సిపల్‌ శంకర్‌ దగ్గర కాలేజీ విషయంలో యాభై వేలు లంచం అడిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

అప్పటికే ప్రభుత్వం ఇతన్ని బర్తరఫ్‌ చేయాలని గవర్నర్ తమిళ సైకి సిఫార్సు చేసింది. కానీ ఆమె దీన్ని పెండింగ్‌లోనే పెట్టింది. ఆలోపే వీసీ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. లంచం మరిగిన చేతులాయె. సంపాదనే ధ్యేయంగా బతికిన వ్యాపారి కదా. చేతులు ఊరికే ఉంటాయా.. నోట్లు లెక్కపెట్టేందుకు అలవాటు పడ్డాయి. అలా యాభైవేలకు ఆశపడ్డాడు. దొరికిపోయాడు. జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి. కొత్త వీసీని నియమించాల్సిందే. సోమవారం కొత్త వీసీ రానున్నాడు. అయితే ఈ ఏసీబీ రైడ్స్‌ కు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకకపోతే రవీందర్ గుప్తా అరచకాలు ఇంకా కొనసాగావే.

ప్రభుత్వం గవర్నర్‌ మీద ఒత్తిడి తెచ్చినా.. ఆమె ప్రభుత్వం ఏది చెబితే అది పెండింగ్‌లో పెట్టే అలవాటు చేసుకున్నారు. ఈ వీసీని బర్తరఫ్‌ చేసే విషయంలో కూడా అలాగే ఫైల్‌ పెండింగ్‌లో ఉండేది. ఇలా ఆర్మూర్‌ శంకర్‌ చేతిలో బలైపోయాడన్నమాట. ఏసీబీ తవ్విన కొద్దీ ఆస్తులు కట్టల పాముల్లా పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. వందల కోట్లకు పడగలెత్తాడు మన వీసీ… కాదు కాదు వీసీ అవతారమెత్తిన రియల్ వ్యాపారి.

You missed