“డబుల్”కు మంగళం… గృహలక్ష్మీకి స్వాగతం…
సాంకేతికంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు సవాలక్ష అడ్డంకులు…
ఇదో ఫెయిల్యూర్ స్కీమ్ కింద జమ కట్టిన సర్కార్…
సొంతింటి జాగా ఉంటే గృహలక్ష్మీ కింద మూడు లక్షలు…
జాగా లేకపోతే .. ప్రభుత్వ స్థలాల పంపిణీ…
ప్రజల్లో డుబల్ బెడ్ రూం స్కీంపై వ్యతిరేకత పోగొట్టేందుకు సర్కార్ కొత్త యోచన…
వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
తెలంగాణ రాకముందు కేసీఆర్ ప్రకటించిన డబుల్ బెడ్ రూం పథకంపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అమలు కాని పథకాల లిస్టులో.. అట్టర్ ఫ్లాప్ అయిన పథకాల జాబితాలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉంది ఈ పథకమే. అందుకే కేసీఆర్ దీనికి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. డుబల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సర్కార్ స్థలం కావాలె. అది దొరికితే కాంట్రాక్టర్ దొరకడు. అతనికి గిట్టుబాటు కాదు. మధ్యలో వదిలేసి వెళ్తాడు. దీంతో ఇవి చాలా చోట్ల కట్టిన వాటిని అలాగే పడిత్‌గా వదిలేశారు. కొన్ని చోట్ల బూత్ బంగ్లాలుగా మారాయి కానీ.. వాటిని మాత్రం లబ్దిదారులకు పంచలేదు. ఎందుకంటే వేలాది మంది దరఖాస్తులు చేసుకుంటే పదుల సంఖ్యలో అవి ఇస్తే మిగితా వారి చేత ఛీ కొట్టించుకుని వ్యతిరేకత మూటగట్టుకోవడమే అవుతుంది.
అందుకే దీన్ని ఎంక్వైరీ పేరుతో, రిజర్వేషన్ల ప్రకారంగా, లాటరీ పద్దతిన అని ఏవేవో సాకులు బుతూ పంపిణీ చేయకుండా తప్పించుకుంటూ వస్తున్నా… ఎన్నికల సమయానికి తమ సొంతింటి కల నెరవేలేదనే నిలదీతలు సర్కార్ తప్పేలా లేవు. దీంతో సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయల స్కీంను ప్రవేశపెట్టింది. అదీ ఇంకా ఆదిలేదు అంతం లేదు. సమయం పడుతుంది. కానీ ఆలోపే వందలాది, వేలాది దరఖాస్తులు వచ్చిపడ్డాయి. దీనికీ ప్రజల నుంచి విమర్శలు వచ్చి పడ్డాయి. సొంత జాగా ఉన్నోళ్లకు ఇస్తారు సరే.. అసలు జాగానే లేనివాళ్ల పరిస్థితి ఏందీ..? అనే నిలదీతలకు ప్రభుత్వం …. సర్కార్ జాగాలను గుర్తించాలని అధికారులను , ఎమ్మల్యేలను ఆదేశించింది. ఎక్కడ ప్రభుత్వ స్థలాలుంటే అక్కడ పేదలకు పంచాలని ఆదేశించింది.
కానీ చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు కనుమరుగైపోయాయి. కబ్జాల కోరల్లో చిక్కుకున్నాయి. ఎలా ఇస్తారు…? ఇదీ ప్రభుత్వానికి తలనొప్పే. ఆది నుంచి హౌసింగ్ స్కీం.. ఏది తీసుకున్న సర్కార్ మెడకు గుదిబండలా మరింది. వచ్చేది ఎన్నికల సీజన్. దీన్ని ఎలా గట్టుక్కుతారు..? ఏం మాటాలు చెబుతారు…? ఇంకా ఏం హామీలిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే నగరంలో న్యూ కలెక్టరేట్ పరిసరాలలో, గిరిరాజ్ కాలేజ్ సమీపంలో సీపీఎం పేదలతో గుడెసెలు వేయించి సొంతింటి స్థలాలు కావాలని కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. ఇవి వచ్చేవి కావు.. వాళ్లు ఇచ్చేవి కావు.. కానీ మధ్య దళారీలు ఒక్కొక్కరి వద్ద ఐదు వేల రూపాయలు వసూలు చేస్తూ మీకు పక్కగా జాగా ఇప్పిస్తామని సందట్లో సడేమియాలా ఆ పేదల నుంచి వసూళ్లు చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.