ఇద్దరూ ఇద్దరే. అనుకుంటే సాధించేదాకా వదలరు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ దశాబ్దాల నాటి కల. ఎప్పట్నుంచో మాకు ఇంటి స్థలాలు కావాలని ఎంతో మంది లీడర్లను అడిగి అడిగి విసిగి వేసారిపోయారు. రిన్నికలు వచ్చే సమయానికి ఇస్తాం చేస్తాం అని హడావుడి చేయడం ఆ తర్వాత చేతులెత్తేయడం… ఇది పరిపాటిగా మారింది. కానీ ఈ సారి సీన్ మారింది. ఎమ్మెల్సీ కవిత ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా ఈసారి నిజామబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని డిసైడ్ అయ్యారు.
నగర శివారు ప్రాంతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. వెంటనే ఆర్టీసీ చైర్మన్, బాజిరెడ్డి గోవర్దన్‌కు జర్నలిస్టుల కోసం అనువైన స్థలాన్ని చూడాల్సిందిగా కోరారు. ఆమె చెప్పిందే తడవుగా బాజిరెడ్డి శివారు ప్రాంతాల్లన్నీ జల్లెడ పట్టారు. చివరకు గుండారంలో దాదాపు 300 మంది జర్నలిస్టులకు సరిపోయే 11 ఎకరాల స్థలాన్ని గుర్తించి దాన్ని ఫైనల్ చేశారు. అయినా కొద్ది మంది జర్నలిస్టులు మొండికేశారు. మాకు అక్కడ వద్దన్నారు. ఏవేవో ప్రాంతాలు సూచించారు.
అక్కడ టెక్నికల్‌గా వచ్చే ప్రాబ్లెంలను కవిత తెలుసుకున్నారు. కలెక్టర్‌తో రెండు మూడు పర్యాయాలు భేటీ అయ్యారు. గుండారం మినహా మిగితా చోట్ల ఏదో ఒక లిటిగేషన్ ఉండటం.. కొద్ది చోట్ల స్థలం ఉన్నా అది జర్నలిస్టులందరికీ సరిపోకపోవడంతో చివరగా బాజిరెడ్డి, కవితలు ఇద్దరూ జర్నలిస్టులందరినీ కూర్చోబెట్టి సముదాయించారు. విషయాన్ని చర్చించారు. పరిస్థితులను వివరించారు. మీలో మీకు సఖ్యత లేకపోతే ఇది పెండింగ్‌లో పడిపోతుందని, మళ్లీ పాత కథే పునరావృతమవుతందని కవిత జర్నలిస్టు సంఘాలకు సూచన చేశారు.
ఆలస్యం చేస్తే మీకు స్థలాలు దక్కే అంశం మరింత ఆలస్యమవుతందని చెప్పండంతో జర్నలిస్టులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ కవిత, బాజిరెడ్డి గోవర్దన్‌లు గుండారంలోని స్థలానికి భూమి పూజ చేశారు. అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, నిజామాబాద్ జర్నలిస్టులు పాల్గొన్నారు.