ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చాలా పెద్ద బాధ్యతే అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్ర.. మన ఊరు కాదు మన పల్లె కాదు… అక్కడి వాతావరణమే డిఫరెంట్. అలాంటి చోట బీఆరెస్ సభలతో జనాల దరికి చేరాలనుకుంది. జన సమీకరణ అంటే పిల్లల మాటలేం కాదు. ఇక్కడ హైదరాబాదో.. నిజమాబాదో అయితే పెద్ద కష్టం కాదు. ఒక్క పిలిపిస్తే తరలివస్తారు చాలా మంది. కానీ అక్కడ. కేసీఆర్ జీవన్‌కు అప్పగించారు కేసీఆర్. నాందేడ్, లోహ.. తాజాగా ఔరంగబాద్‌లలో వరుసగా సభలు సక్సెస్. పార్టీలో చేరికలు అదే స్థాయిలో. మన ఉనికే లేని చోట.. మనపై నమ్మకంతో జనాన్ని తరలించాలంటే ఆ రేంజ్‌లో క్షేత్రస్తాయిలో కష్టపడాలి. వారి భాష, వాతావరణం తగ్గట్టు నడుచుకోవాలి. కష్టాలు పంచుకోవాలి. సమస్యలు తీర్చే మార్గం ఇదేననే విశ్వాసం కలిగించారు. కార్యక్షేత్రానికి రప్పించగలిగాలి. అది చేసి చూపాడు జీవన్. అందుకే ఔరంగబాద్ సభలో ప్రత్యేకంగా జీవన్ పేరును ప్రస్తావించిన కేసీఆర్… సభ సక్సెస్ కావడంతో శభాష్ అంటూ కితాబునిచ్చాడు. అక్కడ పదుల రోజులు తిష్ట వేయడం.. అధినేత ఇచ్చిన పిలుపు.. భుజస్కంధాలపై పెట్టిన బాధ్యతను నెరవేర్చే క్రమంలో శక్తి వంచన లేకుండా శ్రమించి శభాష్ అనిపించుకున్నాడు.