భీంగల్:

బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా పాల్గొన్నారు. సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి మంత్రి హాజరుకావడంతో అక్కడ ఓ కుటుంబమంతా కలిసి పండుగు నిర్వహించుకుంటున్నారా అనే వాతావరణం కనిపించింది. దంపతులిద్దరూ అక్కడికి వచ్చిన కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా పలకరికంచారు. వారి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఊరు ఊరంతా కలిసి వన భోజనాలకు వెళ్లినట్లుగా అంతా సంతోషంగా గడిపారు. సమ్మేళనం ముగిసిన తర్వాత అంతా కలిసి భోజనాలు చేశారు. మీకు మేమున్నాం.. అనే భరోసాను కల్పించడమే కాదు.. మేము మీ కుటుంబంలో సభ్యులమే అనే విధంగా ఈ కార్యక్రమానికి జరగడం పట్ల సర్వత్రా తమ సంతోషాన్ని వెలిబుచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్,డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,డా.మధు శేఖర్, భీంగల్ మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సతీ సమేతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ…
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను ఇక్కడ ఓ పండుగ వాతావరణంలో ఇంటిల్లిపాదితో అందర్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం,బలగం అన్నారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ల ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి మూడు విలువైన మాటలు చెప్పారని రాజకీయాల్లో ఇవి కచ్చితంగా ఉండాలని సూచించారని గుర్తు చేసుకున్నారు. 1.పార్టీ పట్ల విధేయత 2.నాయకుని మాట జవదాటకుండా పూర్తి విశ్వాసంగా ఉండడం.3.ఎన్నుకున్న ప్రజలకు,నమ్ముకున్న కార్యకర్తలకు, పార్టీలకు అతీతంగా సేవ చేయాలి. అని చెప్పారన్నారు.

You missed