మోర్తాడ్:

బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల క్లస్టర్ 2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నాడు జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, పార్టీ జిల్లా ఇంఛార్జి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం బిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు…

బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్సీ కవిత పై లేని పోనీ ఆరోపణలు చేస్తున్నారు. కవితకు సంబంధం లేని కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కేసిఆర్ మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్నడు…అందుకే ఆయన బిడ్డ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరు. నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పతనమైంది. సిలిండర్ ధర రూ. 400 నుంచి రూ.1200 పెరిగింది. పప్పు, అప్పుల ధరలు పెరిగిపోయాయి. డీజిల్ ధర రూ. 40 నుంచి రూ. 100 అయ్యింది. దీంతో ట్రాన్స్ పోర్ట్ ధర పెరిగి నిత్యావసర సరుకుల మీద ప్రభావం చూపుతోంది. సామాన్యుల మీద ధరలు పెరగడం పెను భారంగా మారింది. దీనంతటికి కారణం ప్రధాని మోడీ. తెలంగాణలో ఓ వైపు కేసీఆర్ పేద ప్రజల సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే…. నరేంద్ర మోడీ ధరలు పెంచి సామాన్యులను లూటీ చేస్తున్నారని అన్నారు మంత్రి. ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ. బడా బాబుల కంపెనీలకు రుణాలు మాఫీ చేసి పేదల డబ్బులు దోచుకుంటున్నారు. ఆ డబ్బులతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. అలా తెలంగాణలో 4 గురు ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి పోయారు. వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే…. కేసులు పెడుతున్నారు. రాహుల్ గాంధీ మీద అనవసరంగా… కేసులు పెట్టారు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఇలా 6 గురు మోడీలు డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు. రాహుల్ గాంధీ అన్న మాట ఏంటంటే మోడీ పేరుతో ఉన్న గుజరాత్ కు చెందిన 6 గురు అని అంటేనే ఆయన్ను ఎంపీ గా డిస్ క్వాలిఫై చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎమర్జెన్సీ కంటే చాలా అన్యాయం జరుగుతోంది. దర్యాప్తు సంస్థలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. దీన్ని ప్రజలు గమనించాలి. బాల్కొండ నియోజక వర్గ ప్రజల ఆశిష్షులతోనే ఇవాళ నేను ఇలా ఉన్నాను. కేసీఆర్ తో నాకున్న సాన్నిహిత్యం వల్ల ఆయన దయతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గ్రామాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. దొన్పాల్ అనే గ్రామంలో 300 ఇల్లు ఉంటే 316 మందికి పెన్షన్లు, రైతు బంధు కింద 375 మందికి రైతు బంధు ఇలా ఏ చిన్న గ్రామాన్ని వదలకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ప్రజలు అండగా ఉండాలని అడిగే హక్కు కేసీఆర్ కు ఒక్కడికే ఉంది.

పెద్దాయన డి.ఎస్ పరిస్థితి ఏ తండ్రికి రావొద్దు

అభివృద్ధి చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లోనే రెండు పార్టీలు ఉన్నాయి. పెద్ద కొడుకు, చిన్న కొడుకు రాజకీయాలు అనారోగ్యంగా ఉన్న తండ్రిని ఇబ్బంది పెడుతున్నారు. డీఎస్ కాంగ్రెస్ లో చేరలేదని భార్య ఒక వైపు లేఖ రాసింది. కాంగ్రెస్ లో చేరాడని పెద్ద కొడుకు, చేరలేదని చిన్న కొడుకు. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని బాండు పేపర్ రాసిచ్చి 5 ఏళ్ల వుతున్నా…. పసుపు బోర్డు లేదు. బాండు పేపర్ విలువను కూడా తగ్గించాడు అరవింద్. ఎంపీగా అరవింద్ జిల్లాకు ఏం చేశాడు అని అడిగితే…. సమాధానం చెప్పకుండా బూతులు తిడుతున్నాడు. ఎంపీ అరవింద్ వల్ల ఇంట్లో తల్లి దండ్రులకు మనశ్శాంతి లేదు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి లేదని అన్నారు.కచ్చితంగా పసుపు రైతుల ఉసురు తగిలిందన్నారు మంత్రి వేముల.

 

You missed