నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి గ్రామానికి చెందిన సుదర్శన్‌ గౌడ్‌ కూతురు మిరుదొడ్డి రవీనా అనే మహిళ ప్రసవనంతరం కరోనా సోకడంతో ఏడాది క్రితం మృతి చెందింది. ఆమెను కాపాడుకోవడానికి రూరల్‌ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్ తనవంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ప్రభుత్వంతో మాట్లాడి ఎల్‌వోసీ కింద పది లక్షల రూపాయలు ఇప్పించాడు. కానీ ఆమెకు ఆ మొత్తం ఉపయోగంలోకి రాకముందే పండంటి బాబుకు జన్మనిచ్చి ఆమె తనువు చాలించింది. ఇవాళ ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు జడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు బాజిరెడ్డి జగన్ మోహన్ ప్రజా ప్రతినిధులతో కలిసి పరామర్శించారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద పది లక్షల రూపాయాలను రవినా కుటుంబానికి అందజేసి వారికి అండగా నిలిచారు.

ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవినిలా , ఒక వరంగా పనిచేస్తున్నదని అన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి మంజూరైన పది లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశామన్నారు. ఈ ఆర్థిక మొత్తం ఆ పసిబాలుడి ఎదుగుదలకు ఎంతో ఉపయోగడపతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, మండల అధ్యక్షులు చిలువేరి దాసు, సర్పంచ్ లలితా గంగాదాస్,తెలు విజయ్ కుమార్,నరేష్, సినియర్ నాయకులు పాశం కుమార్, అరటి రఘు, ఎంపిటిసి చింతల దాస్, పులి శ్రీనివాస్, పులి సాగర్,డీకోండ సుదిర్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం…
ఇందల్వాయి మండలం చంద్రయాన్ పల్లి సమ్యనాయక్ తండాకు చెందిన మాజి సర్పంచ్ తిమ్మిబాయి భర్త మోతీలాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.అదే కాకుండా సౌమ్య నాయక్ తండాలో ఇతరులు వివిధ కారణాల చేత మృతి చెందిన విషయం తెలుసుకొని బుధవారం వారి నివాస గృహాలకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను  బాజిరెడ్డి పరామర్శించారు. అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

You missed