నిజామాబాద్, వేల్పూర్:
బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్,ఏర్గట్ల,మోర్తాడ్,భీంగల్, కమ్మర్పల్లి,బాల్కొండ మండలాల నుండి బీజేపీ,కాంగ్రెస్,బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు వెయ్యిమంది పైగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…
కేసిఆర్ గారి జనరంజక పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరిన వారికి హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్న అన్నారు.
ఈ సందర్బంగా…బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి వేముల మండిపడ్డారు..తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతగాని బీజేపీ..ఒక్కో తెలంగాణ ఎమ్మేల్యేకు మాత్రం 100 కోట్లు ఇచ్చి కొంటారట అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రధాని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. కేసిఆర్ గారి కంటే మెరుగ్గా… రైతులకు ,పేదలకు మోడీ ఎం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇప్పటికే 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చారు.కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.12 వేల కోట్లు ఏడాదికి పింఛన్లు రూపంలో అందిస్తున్నామని తెలిపారు.గుజరాత్ లో రూ.700 పింఛన్, తెలంగానలో రూ.2000, ఉత్తర ప్రదేశ్ లో రూ.600, బిహార్ లో రూ. 300, కర్ణాటకలో రూ.750 లు మాత్రమే పింఛన్లు ఇస్తున్నరన్నారు. ఎకరానికి రూ.10వేల చొప్పున 5ఎకరాలకు 50వేలు రైతుబందు ఇస్తున్నామని,మోడీ ఇచ్చేది కేవలం రూ.6 వేలు మాత్రమే అని అన్నారు. ఆరువేలు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూతపడితే తెరిచి జాతీకి అంకితం చేసినట్లు మోడీ ఫోజులు ఇచ్చారని, ఎప్పుడో పాతది కొంత రిపైర్లు చేసి కొత్తగా నిర్మాణం చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.
తెలంగాణలో 8 ఏళ్లుగా లైన్లు కట్టకుండా సరిపడా ఎరువులు రైతులకు కేసీఆర్ అందిస్తున్నాడని అన్నారు. భారత దేశం ఎరువుల దిగుమతి చేసుకోవడం లేదని ప్రధాని పచ్చి అబద్ధాలు చెప్పారని కానీ ఎరువులు దిగుమతి చేసుకోవడంలో ప్రపంచంలోనే భారతదేశం మూడవస్థానంలో ఉందని గుర్తు చేశారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మోడీ అబద్దాలు మాట్లాడుతుంటే ఎలా అని ప్రశ్నించారు. కేసీఆర్ పేదలను బాధపెడుతున్నాడు అని నీచంగా మాట్లాడారు. రైతుబందు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్టు ఇలా పేదలకు ఏదో రకంగా లబ్ది చేకూర్చుతున్నారని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రతి వస్తువు విలువ పెరిగిపోయిందని, దీంతో పేదలపై తీవ్ర భారం పడుతోందన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం కేవలం మోడీ వల్లనే అని, పేదలపై భారం వేసే మోడీ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ 100 కోట్లు ఇస్తుందని,నరేంద్ర మోడీ ఈ వ్యవహారం నడుపుతున్నడన్నారు. 8 రాష్ట్రాల్లో రూ.40 వేల కోట్లతో ఎమ్మెల్యే లను కొని ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలదోశారని మండిపడ్డారు.
8 ఏళ్ల కాలంలో మోడీ స్నేహితులైన వ్యాపారస్తులు అయిన ఆధాని, అంబానీ లాంటి వాళ్లకు 12 లక్షల కోట్ల రుణాలను మాఫి చేశారని, ఆ డబ్బులతోనే తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలు చేస్తున్నారన్నారు. ఢిల్లీ లో కూడా 42 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి, ప్రభుత్వాన్నీ కూల్చేస్తారని ఆధారాలు బయట పడుతున్నాయని అన్నారు. దేవుడి పేరుతో కూడా తూ… నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్ర యాదాద్రిని తడి బట్టలతో ప్రమాణం చేసి అపవిత్రం చేశాడని మండిపడ్డారు. తిరుపతి నుంచి వచ్చిన స్వామీజీకి బండి సంజయ్ మిత్రుడే విమాన టికెట్ బుక్ చేశాడని గుర్తు చేశారు. 8 ఏళ్ల క్రితం ఆధాని ఆస్తి 50 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు 11 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సీబీఐ కి అప్పగించాలని అంటున్నారని,తప్పించుకునే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. మోడీకి తెలిసే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడుస్తోందని,బీజేపీ కి ఆ ముగ్గురితో సంబంధం లేకపోతే దర్యాప్తు ఆపాలని బీజేపీ నేతలు ఎందుకు కొర్థులో పిటిషన్ వేస్తున్నారని మండిపడ్డారు. ఏమి చూస్తావో మోడీ… దా చూసుకుందాం. నువ్వు గోకిన గోకకపోయినా నేనే గోకుతా అని కేసీఆర్ చెప్పిండు. మీ బండారం బయటపెట్టిండు అని మంత్రి వెల్లడించారు. దగుల్బాజీ బీజేపీ దేశాన్ని అమ్ముతున్నారని,పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వరంగ సంస్థలు అమ్మేస్తున్నారు.ఇలాగే ఉంటే మన పరిస్థితి శ్రీలంక మాదిరిగా అవుతుందన్నారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని మోడీ మాట్లాడడం విడ్డురం అని..బోర్ల కాడ మీటర్లు పెట్టడానికి మోడీ చూస్తుంటే, కేసీఆర్ ససేమిరా అంటున్నారు. వడ్లు కొనడం చేతకాని మోడీకి ఎమ్మెల్యేలను కొనడానికి లక్షల కోట్లు మాత్రం వస్తాయన్నారు. తెలంగాణ వడ్లు కొనమంటే తెలంగాణ ప్రజలను నూకలు తినుమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిండని అన్నారు. పసుపు రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడిన ప్రధాని… వాళ్ల బీజేపీ ఎంపి పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసిన సంగతి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యకర్త మీ గ్రామాల్లో మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాల్సిన భాద్యత భుజాన వేసుకోవాలని మంత్రి వేముల ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.