హైదరాబాద్/ నిజామాబాద్‌:

నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మ‌డి జిల్లా ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్‌, రాష్ట్ర ఉమెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఆకుల ల‌లిత‌, నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్‌గుప్తా, నిజామాబాద్ జిల్లా ఒలంపిక్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు ఈగ సంజీవ్‌రెడ్డి , జ‌న‌ల‌ర్ సెక్ర‌ట‌రీ బొబ్బిలి న‌ర్స‌య్, జిల్లా ఉపాధ్యాక్షులు బాజిరెడ్డి జ‌గ‌న్‌లు హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణకు గర్వకారణం అన్నారు. భవిష్యత్ లో ప్రపంచ స్థాయిలో రాణించి దేశ కీర్తిని మరింతగా పెంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆమెకు వారు శుభాకాంక్షలు తెలిపారు.

You missed