మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిసి ఆర్టీసీ చైర్మ‌న్‌, నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ అభినంద‌న‌లు తెలిపారు.  ఆర్టిసి సంస్థకు ఆర్థిక సహాయ, సహకారాలు అందిస్తూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న పురపాలక 

, ఐటి శాఖ మంత్రివర్యులు  కల్వకుంట్ల తారక రామారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులందరూ తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు , మెరుగైన సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ ముఖ్యమంత్రి కెసిఆర్  నాయకత్వాన్ని బలపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.

హైదరాబాద్: ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించిన సందర్భంగా  పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అంద‌జేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలే, మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థిని గెలిపించారని చెప్పారు..

టిఎస్ ఆర్టిసి సంస్థకు తెలంగాణ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు 100 కోట్లు మంజూరు చేసి, సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషక‌ర‌మ‌న్నారు.

ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ అభ్యున్నతి దిశగా పయనిస్తుందని చెప్పారు..
కానీ ఇతర రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థ దుర్బర స్థితిలో ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఆశీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న 5 డిఏలు, దీపావళి సందర్భంగా పండగ అడ్వాన్సులు ఇవ్వడం వల్ల ఉద్యోగులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.

టిఎస్ ఆర్టిసి సంస్థకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న  పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు  కల్వకుంట్ల తారక రామారావు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులందరూ తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు,  మెరుగైన సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ  ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్  నాయకత్వాన్ని బలపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

అతి త్వరలోనే  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఉద్యోగులకు పిఆర్సిని అమలు చేయడం జరుగుతుందని సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్  తెలియజేశారు..

You missed