ప్ర‌చార బాధ్య‌త‌లు ఇచ్చారు. ఏదో అలా తిరిగి .. దండం పెట్టి .. ఓ చిరున‌వ్వి ముఖం మీద రుద్దుకొని .. ఓటేయండి మాకే అని విజ్ఞ‌ప్తి చేసి… అబ్బ ఈ రోజుకిలా ముగిసిందిరా ప్ర‌చారం అని ఊపిరి పీల్చుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణం. బాస్ బాధ్య‌త‌లు అప్ప‌గించాడు. నాయ‌కుడిగా త‌ను ప్ర‌చారం చేసి పెట్టాలి. వీలైన‌న్ని ఓట్లు రాబ‌ట్టాలి. మంచి మాట‌లు చెప్పాలి. సంక్షేమ ప‌థ‌కాలు వివ‌రించాలి. ఏం చేశామో..? ఏం చేస్తామో చెప్పాలి. వారేం చెయ్య‌లేదో… వారొస్తే ఎంత ప్ర‌మాద‌మో వివ‌రించాలి. మ‌ళ్లీ ఇవ‌న్నీ ఓ వైపు. నాణానికి ఇవి రెండు వైపులు.

కానీ క‌నిపించ‌ని ఓ మ‌రోకోణం ఇలా బ‌య‌ట‌ప‌డింది. జ‌నం నాడి తెలుసుకోవ‌డం అంత ఈజీ కాదు.. కానీ నాడి ప‌ట్ట‌డం సులువే. ఏందీ నాడి ప‌ట్టి చూడ‌టమా… ఎలా సాధ్యం..? అనుకుంటున్నారా..? అంద‌రికీ సాధ్యం కాదు.. కానీ ఆ నాయ‌కుడే డాక్ట‌ర్ అయితే సాద్య‌మే. కానీ ఆ బిజీ వాతావ‌ర‌ణంలో అంత‌టి ఓపిక ఉందా..? ఇగో ఇక్క‌డ క‌నిపించిందా దృశ్యం.. అస‌లు జ‌నం నాడి ప‌ట్ట‌డ‌మంటే ఇదే. విధుల్లో , బాధ్య‌త‌ల్లో త‌ల‌మున‌క‌లైపోయి… నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేయ‌డ‌మంటే ఇదే..!

You missed