తెలంగాణ ఉక్కు మహిళ మా కవితక్క …….

ఆడబిడ్డపై ఎందుకు నీకు అంత అక్కసు.నీ ఆంధ్ర ఆదిపత్య సంస్కృతిని అడ్డుకుందనా?తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపమైందనా?మా తెలంగాణ బతుకమ్మను పూలపల్లకి ఎక్కించి విశ్వమంతా తిప్పిందనా?వేలాదిమంది మహిళలను కూడగట్టి ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడించి మీ దుర్మార్గానికి చరమగీతం పాడిందనా??

ఎందుకు……ఎందుకు ఆడకూతురుపై అడ్డమైన రాతలు రాస్తున్నావు..ఆధారాలు లేకుండా అవాకులు చెవాకులు ఎందుకు ????

మొన్న “మద్యం కుంభకోణంలో కవిత పాత్ర “అన్నావు..నిన్న “కవితకు ఈడి సమన్లు” అన్నావు..నేడు “తదుపరి అరెస్టు కవితే”అంటున్నావు.
కక్కిన కూడు తినే నువ్వా కవితక్క గురించి రాసేది
ఆడదాన్ని అవమానించినవాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు….. నీకు కాలం చెల్లింది

సీతను అపహరించినందుకు లంకాదహనం జరిగింది,రావణరాజ్యం రావణ కాష్టం అయింది.
ద్రౌపదిని అవమానించినందుకు మహాభారత యుద్దం జరిగింది,కురువంశం కుప్పకూలిపోయింది.
బెల్లిలలితక్కను హత్య చేసిన ముగ్గిరిలో ఒకడు ముక్కలు ముక్కలయ్యాడు,ఇంకొకడు కుక్క చావు చచ్చాడు..మరొకడు తెలంగాణ గడ్డపై నుండి అరెస్టు భయంతో బిక్కుబిక్కుమంటూ బిచాణా ఎత్తేశాడు..మా కవితక్కను అవమానిస్తున్నందుకు నీవు కూడా మూల్యం చెల్లిస్తావు కాచుకో!!

Sridevi Mantri

You missed