సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా ఇందూరు టీఆరెస్ వినూత్నంగా ఆలోచించింది. ఏ పార్టీకి సంబంధం లేకుండా.. పార్టీ ఉనికి, ఆనవాళ్లు కనబడుకుండా నగరంలో విరివిగా .. చాలా చోట్ల ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఆలోచించండి… తెలంగాణ ప్రజలారా..!! మనకు కావాల్సింది పచ్చని పంటల తెలంగాణ నా..? మత పిచ్చి మంటల తెలంగాణ నా..?? అని కేవలం ఇవే రైటింగ్స్‌కు పరిమితమై.. ఎవరి పేరు..ఊరు లేకుండా రాసిన ఈ ఫ్లెక్సీలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పుంజుకుంటున్నదనే వాస్తవం. దీనికి నాయకుల తీరు కూడా ఓ కారణం. సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఆకర్షించేందుకు.. నగర ప్రజలకు ఆలోచింపజేసేలా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ పలువురిని ఆకట్టుకుంటున్నది. కొద్ది సేపు ఆగి మరీ చూసి వెళ్తున్నారు. టీఆరెస్ సభ నేపథ్యంలో వెలిసిన ఈ ఫ్లెక్సీలు టీఆరెస్ శ్రేణులే ఏర్పాటు చేశారనేది బహిరంగ రహస్యం. కానీ దీన్ని ఏ పార్టీకి సంబంధం లేదన్నట్టుగా రాసి పెట్టడం మాత్రం ఆకట్టుకున్నది.