ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే…… ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ నిన్న క‌విత‌తో ఇంట‌ర్వ్యూ తీసుకున్నాడు. త‌న అభిప్రాయాల‌నే బ‌లవంతంగా రుద్దాల‌నే అత‌ని దోర‌ణి ఇందులో ఇంకా ప‌తాక‌స్థాయికి చేరింది. పైగా నోటి దూల ఉండ‌నే ఉంది. నీకు అని ఒక‌సారి నువ్వు అని ఒక‌సారి… మీరు అని ఒక‌సారి, మీ నాయ‌న అని ఒక‌సారి…. చివ‌ర‌కు త‌న‌కు అల‌వాటైన దోర‌ణిలో బొంగు అనే ప‌దం కూడా వాడేశాడు. త‌న పైత్య‌మంతా ఇలా చూపించాడు. క‌వితతో జ‌ర్న‌లిజం పాఠాలు చెప్పించుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నాడు.

ప్ర‌శ్న‌ల‌డిగే వాడు కూల్‌గా కావాల్సింది రాబ‌ట్టాలి. నువ్వే అలా ఆవేశ‌ప‌డిపోయి.. అవ‌త‌లి మ‌నిషిపై దండ‌యాత్ర చేసిన‌ట్టు మాట్లాడితే…. ఎలా కిట్టు…? అక్క‌డ మోడీ ఉన్నాడు. టెన్ష‌న్ ప‌డుతున్నావా…? ఇంకో మాట‌చెప్పు… అంటూ టీజింగ్ చేసే విధంగా రాధాకృష్ణ మాట‌లున్నాయి. అవ‌త‌ల ఓ ఆడ‌ప‌డుచుతో మాట్లాడుతున్నాన‌నే సోయి కూడా లేన‌ట్టుంది. మ‌రిచిన‌ట్టున్నాడు. త‌న స్టూడియోకు అంద‌రినీ పిలిచి త‌న నోటికొచ్చింది అడిగి.. దూల తీర్చుకోవ‌డం అల‌వాడుప‌డిన రాధా …. క‌విత‌తో ఇంకా ఎక్కువ పాళ్లే దిగ‌జారి మాట్లాడాడు.

చాలా విష‌యాల‌కు స‌బ్జెక్ట్ బేస్డ్‌గానే క‌విత స‌మాధానం ఇచ్చింది. అదీ ఓపిగ్గా. ఎక్క‌డా టెంప‌ర్ కోల్పోలేదు. త‌న‌కు అన్నీ తెలుసంటాడు. త‌ను అక్క‌డే ఉన్నాను.. క‌ళ్లారా చూశాను.. చెవులారా విన్నాను అనే విధంగా. అదే జ‌ర్న‌లిజం అంటాడు. ఏవేవో చెప్ప‌బోయి …. క‌వితతో చెప్పించుకున్నాడు. అంద‌రికీ శ‌కునాలు చెప్పిన బ‌ల్లి చివ‌రకు కుడితిలో ప‌డి చ‌నిపోయింద‌న్న సామెత చందంగా….

You missed