జాబ్_కావాలా …???
హైదరాబాద్ లో జాబ్ సంపాధించడం ఇంత ఈజీనా … ??
కొత్తగా భాగ్యనగరం లో అడుగు పెట్టిన వాళ్లకు ఈ పోస్టర్ల్ చూస్తే జాబ్ దొరకడం చాలా ఈజినే అనిపిస్తుంది.
కానీ ఈ పోస్టర్ల వెనక చాలా కథనే ఉంటుంది.
జాబ్ కావాలంటే ముందుగా కొంత అడ్వాన్స్ చెల్లించాల్సిందే. తరువాత అస్సలు విషయం బయటకు వస్తుంది.
తిరిగి,తిరిగి విసుగు వచ్చి ఆ డబ్బులు వదులుకోవాల్సిందే కానీ జాబ్ చూపించే అవకాశమే తక్కువ.
ఇలాంటి పోస్టర్ ల బాధితులు ఎంతోమంది కనీసం పోలీస్ కేస్ కూడా ఫైల్ చెయ్యడానికి చిన్న అమౌంట్ కదా అని చూసి, చూడనట్లు వదిలేస్తున్నారు…
( అన్నీ ఒకేలా ఉండవనుకోండి. ఇందులో కొన్ని నిజాయితీగా జాబ్ చూపించే సంస్థలు కూడా ఉంటాయి. కానీ అవి వేళ్ళల్లో లెక్క పెట్టచ్చు )
Manjeera Srinivaas