నిన్న జ‌రిగిన బీజేపీ మునుగోడు స‌భ‌తో మంచి ఊపులో ఉన్నాడు బండి సంజ‌య్‌. అమిత్ షా కూడా మంచి ఊపులో కేసీఆర్‌ను గ‌తంలో కంటే కొంచెం ఎక్కువే తిట్టాడు ఘాటుగా. అంతా ఖుష్‌. బండి సంజ‌య్ నేతృత్వంలో స‌భ స‌క్సెస‌యింద‌ని అంతా భేష్ అని పొగిడారు. బండి మాంచి కిక్కు మీద ఉన్నాడు ఈ స‌భ స‌క్సెస్‌తో. ఆ కిక్కు ఇంకా త‌ల‌దిగ‌క‌ముందే ఓ వీడియో వ‌చ్చి ప‌డింది సోష‌ల్ మీడియాలో పిడుగులా. అమిత్ షా బ‌య‌ట‌కు వెళ్తుంటే మ‌న బండి వెళ్లి చెప్పులు అందించాడు. కొంచెం సాయం చేశాడు. అంతే.

దీన్నే త‌ప్ప‌న్న‌ట్టుగా.. బానిస‌గిరీ అయిన‌ట్టుగా… ఏదో చేయ‌రాని నేరం చేసిన‌ట్టుగా ఒక‌టే ట్రోల్‌, వైర‌ల్‌. ఈ వీడియోనే తింపీ తింపీ… క‌ళ్లు తిరిగేలా.. రోత పుట్టేలా ఒక‌టే పోస్టుంగులు. ఎవ‌డికి తోచిన కామెంట్లు వాడు.తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతూనే ఉన్నారు. థూ నీ బ‌తుకు చెడా అని మొద‌లు పెట్టి వ‌ర్ణించ‌లేని రీతిలో అర్సుకుంటున్నారు. ఇదేంద‌యా ఇది. ఈ సోష‌ల్ మీడియా ఏమో గానీ దీనమ్మ దీని దెబ్బ‌కు ఉన్న స‌త్తువంతా నీరుగారి… చెప్పుల మోత దెబ్బ‌తో నెత్తి బొప్పిక‌ట్టినంత ప‌నైంది. అయినా మీరు మాత్రం మీ బాసుకు చెప్పులు మోయ‌రా… నేను దొరికాను.. మీరు దొర‌క‌లేదు అంతే క‌దా.. ఏదో ఒక‌రోజు మీరూ దొర‌క‌క‌పోరు.. అప్పుడు చూపిస్తాం మా త‌డాఖా..!!

You missed