నిజమైన దేశభక్తి
సంవత్సరంలో రెండ్రోజులు జండా పట్టుకుని తిరిగితేనో, వాట్సప్ లో, ఫేస్బుక్ లోనో wishes చెబితేనో దేశభక్తి ఉన్నట్లు కాదు.
దేశ పౌరులుగా మనకున్న బాధ్యతలు/విధులు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అదే మనం దేశానికి చేసే పెద్ద సేవ.
ఎందుకంటే మన మీద వున్న బాధ్యత మరొకరికి హక్కు కావచ్చు. మన బాధ్యతలను మనం నిర్వర్తించక పోవడం వల్ల మరొకరి హక్కులను కాలరాయడం జరగొచ్చు.
అందుకే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానైనా రాజ్యాంగం మన మీద మోపిన బాధ్యతలు ఏంటో తెలుసుకుందాం.
1. భారత #రాజ్యాంగాన్ని గౌరవించవలెను. రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించవలెను.
2. భారత స్వతంత్ర సంగ్రామంలో, ప్రోత్సహింపబడ్డ #ఆదర్శాలను గౌరవించాలి.
3. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి, పెంపొందింపవలెను.
4. అవసరం లేదా అవకాశం గలిగితే భారతదేశానికి సేవచేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా వుండవలెను.
5. భారతదేశంలో, కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా #ప్రజలందరినీ గౌరవించవలెను. సోదరభావాన్ని, సౌభ్రాతృత్వాన్నీ పెంపొందించవలెను. స్త్రీల యొక్క గౌరవమర్యాదలను భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలను పద్ధతులను విడనాడాలి.
6. మన భారతదేశంలో గల #మిశ్రమ_సంస్కృతినీ, మిశ్రమ, అద్భుత వారసత్వాన్ని కాపాడుకొనవలెను.
7. ప్రకృతీ పరిసరాలైన అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకొనవలెను.
8. #శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడవలెను.
9. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను #కాపాడవలెను. హింసను విడనాడవలెను.
10. భారతదేశం అభివృద్ధి చెందునట్లు, వ్యక్తిగతంగాను, సామాజికంగాను లేదా మిశ్రమంగానూ పాటుపడుతూ, దేశ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ, దానిని సాధించుటకు కృషిచేయవలెను.
ఇవన్నీ సక్రమంగా చేయడమే నిజమైన దేశభక్తి.
ఒకవైపు వీటిని (ముఖ్యంగా ఐదవది )తూట్లు తూట్లుగా పొడిచేస్తూ, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు అన్నట్లు కవరింగ్ ఇస్తూ ఉండటం మాత్రం మన దేశ దౌర్భాగ్యం.
Copied from Saraswathi V S Reddy