ఆడమగ తేడాలేదు. అర్థనగ్నం దాటిపోయి నగ్న ఫోటోలు కూడా కామన్ స్థాయికి మార్చేశారు. దాన్నే నాగరికత అంటారు. బేర్ బాడీని ప్రదర్శిస్తూ బోల్డ్ లుక్కులతో ఫోటోలకు ఫోజులిస్తూ అదే డేర్‌నెస్ అంటారు. అదే బిజినెస్‌కు మంచి మార్గమని తలస్తారు. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ ఫోటో కూడా అదే కోవలోకి వచ్చింది. వార్తల్లో వ్యక్తిగా ఉండాలె. అది వైరల్ కావాలె. అందరి నోళ్లలో నానాలె. ఏంచేయాలె…? ఇగో ఇలా బరిబాతల బరితెగించి ఫోటోలకు ఫోజులియ్యాలె. అంతే ఎవరెవరో ఏమేమో అనుకుంటారు. మనకేంటీ..? మనకొచ్చే పబ్లిసిటీ , పైసలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతాయి. అదే కదా కావాల్సింది. కేసులేసుకుంటారా? అయితే ఏమైతది….? అదీ ఓ పబ్లిసిటీయేగా.