జర్నలిస్ట్ ల ఫోటోలు తీసిన మంత్రి వేముల
హైదరాబాద్:
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని టిఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్త కవరేజీ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులు మంత్రి జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతుండగా ఫోటో కోసం చూశారు. అది గమనించిన మంత్రి మీరు మా ఫోటోలు తీస్తారు కదా ఈసారి నేను మీ ఫోటోలు తీస్తాలే అని సరదాగా ఫోటో క్లిక్ మనిపించారు. దీంతో జన్మదిన వేడుకల్లో నవ్వులు పూశాయి.