ధ‌ర‌ణి నుంచి క‌లెక్ట‌ర్ల‌ను త‌ప్పించి క్షేత్ర‌స్థాయిలో రెవెన్యూ అధికారుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లిస్తేనే భూ సమ‌స్య‌ల ప‌రిష్కారానికి చెక్ ప‌డుతుంద‌ని ప్ర‌భుత్వానికి క‌లెక్ట‌ర్లు చెప్పిన‌ట్టు తెలిసింది. త్వ‌ర‌లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించేందుకు స‌మాయ‌త్త‌మ‌యిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో మాట్లాడింది. వారి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకున్న‌ది. ఎలాంటి స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్నాయి…? కార‌ణ‌మేంటీ..? ఏం చేస్తే ఇవి సాల్వ్ అవుతాయి ..? లాంటి వాటిపై వివ‌ర‌ణ తీసుకున్న‌ది. అన్ని స‌మ‌స్య‌ల‌కు మూలం ఈ బాధ్య‌త‌ల‌న్నీ క‌లెక్ట‌ర్ ఒక్క‌డికే అప్ప‌గించ‌డ‌మ‌ని, దీని నుంచి త‌ప్పించి… కింది స్థాయి రెవెన్యూ అధికారుల‌కు కూడా ఇందులో భాగ‌స్వామ్యం క‌ల్పిస్తే ఏ స‌మ‌స్య‌లూ ఉండ‌వ‌ని వారు ప్ర‌భుత్వానికి చెప్పిన‌ట్టు తెలిసింది. కానీ సీఎంకు త‌హ‌సీల్దార్లు, ఆర్డీవోల‌పై సరైన న‌మ్మ‌కం లేదు. వారు అవినీతిప‌రుల‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్నాడు. మొన్న జ‌రిగిన ప్రెస్ మీట్‌లో కూడా ఇదే విష‌యాన్ని చెప్పాడాయ‌న‌. అందుకే ఆయ‌న క‌లెక్ట‌ర్ల‌కే పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించాడు.

You missed