“విరాట పర్వం” సినెమా

వేదవ్యాసుడు సంస్క్రుతం లో రాచిన మహాభారతం లో 18 పర్వాలు ఉన్నై అని మనకి తెలిసిందే. 4 వ పర్వం “విరాట పర్వం”. పంచమ వేదం గా భావించే మహాభారతాన్ని తెలుగు లో మొదటి మూడు పర్వాలు అయిన ఆది పర్వం, సభా పర్వం, అరణ్య పర్వాల్ని నన్నయ రాస్తే, 4 నుంచి 18 పర్వాల వరకు తిక్కన రాశాడు (అరణ్య పర్వం లో నన్నయ పూర్తి చేయలేకపోయిన కొంతభాగం ఎఱ్ఱన రాయటం వలన కవిత్రయం అన్నారు, అది వేరే సంగతి)

విరాట పర్వం విషయానికి వస్తే కౌరవులతో జూదం లో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, ఆ తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు అని మనకి తెలుసు. 12 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకొని విరాట రాజు కొలువులో మారు వేషాల్లో అజ్ఞాతవాసం గడిపిన ఆ సంవత్సరం గురించే “విరాట పర్వం” లో ప్రధానం గా ఉంటుంది.

అజ్ఞాత వాస సమయం లో ధర్మరాజు “కంకుడు” అనే మారు పేరుతో, అర్జునుడు “బ్రుహన్నల” పేరుతో, భీముడు “వల్లవ” పేరుతో, నకులుడు “గ్రంధిక” పేరుతో, సహదేవుడు “తంతిపాలుడు” పేరుతో విరాట రాజు కొలువు లో చేరారు. ద్రౌపది ఏమో విరాట రాజు గారి భార్య కి పని మనిషి (పరిచారిక) గా “సైరంధ్రి” పేరుతో చేరింది.

అజ్ఞాత వాసం ముగుస్తుంది అనగా కీచకుడు అజ్ఞాతవాసం లో ఉన్న సైరంధ్రి (ద్రౌపది) ని వంచించాలని చూస్తాడు, దుర్యోధనుడు దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకి పన్నాగం పన్నుతాడు. విరాట పర్వ లో ఇంకో ఘట్టం విరాట రాజు కుమార్తె ఉత్తర అర్జునుడి కొడుకు అభిమన్యుడి తో ప్రేమ నడపటం.

అది అలనాటి భారతం కాబట్టి అజ్ఞాతవాసం లో ఉన్న పాండవులు ఆపదలనుంచి గట్టు ఎక్కి “ఉత్తర – అభిమన్యుల” వివాహం తో మంగళ దాయకం గా విరాట పర్వం ముగుస్తుంది.

మరి దర్శకుడు వేణు ఉడుగుల సినెమా ఈనాటి విరాట పర్వం లో “రానా – సాయి పల్లవి” ల ప్రేమ కథ ఎలా ముగుస్తుందో తెలియదు. వీళ్ళు కూడా నక్సలైట్లు కాబట్టి అజ్ఞాతవాసమే. అజ్ఞాతవాసం లో ఉన్నప్పుడు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించి నిలబడి పోరాడటం చాలా కష్టం.

దర్శకుడు వేణు ఉడుగుల గతం లో “నీదీ నాదీ ఒకే కథ” తీశారు. తొలితరం లో “శంకరా భరణం” తెలుగు సినెమా దిశ దశని మార్చింది. ఆ తర్వాత చాలా కాలానికి విజయ్ దేవరకొండ నటించిన “పెళ్ళి చూపులు” తెలుగు సినెమా చరిత్ర లో ఒక వినూత్న ఒరవడి స్రుష్టించింది. నిజానికి వేణు ఉడుగుల తీసిన “నీదీ నాదీ ఒకే కథ” కూడా పెళ్ళి చూపులు లాగే ఒక కొత్త పంధా ని స్రుష్టించిన సినెమా.

ఒక కథ ని అనుకొని ఆ కథ ని మాత్రమే చెప్పాలనుకునే దర్శకుడు వేణు ఉడుగుల. ఆ నాటి భారతాన్ని నేటి భారతం లో జరిగిన ఒక సంఘటన ఆధారం గా తీసిన ఒక ఆర్గానిక్ సినెమా “విరాట పర్వం”. జూన్ 17 న విడుదల కాబోతుంది.

All the very best Venu Udugula

 

Jagannadh Goud

You missed