ఇది మీకు తెలుసా.??
పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ముగిసినయి.
టెన్త్ ఎగ్జామ్స్ అంటే ఎంత టెన్షన్ ఉండేది.? ఎంత హడావిడి ఉండేది.?
జీవితంలో ప్రధాన ఘట్టం పదో తరగతి.
అసలు పదోక్లాస్ పరీక్షలు జరిగితే పేరెంట్స్.. స్టూడెంట్స్.. టీచర్స్ ఏదో కొత్త లోకంలో ఉండేది.🥱
ఎన్నడూ గుడికి పోనోడు టెన్త్ ఎగ్జామ్స్ అనంగనే గుడికి పోయేది. ఫస్ట్ క్లాసులో పాసైతే పేరెంట్స్ మంచి గిఫ్ట్ ఆఫర్ చేస్తుండె. నక్క చిట్టీలు కొడితే డిబార్ అయ్యేవాళ్లూ. ఫలానా సెంటర్ ఈజీ అని.. బిట్ పేపరైనా చెప్తే బాగుండు అనే కోరికలు.. ఇట్లా రకరకాలుగా ఉండేది.
ఇగ పిలగాడేం పని చేస్తడయా అని అడిగితే పది పాసయిండు అన్న గొప్పగా చెప్పుకుంటోళ్లు.
ఇప్పుడైతే ఇదేదీ పెద్దగా లేదు. టేకిట్ ఈజీ.
లైట్ తీసుకుంటుండ్రు.
ఈసారి ఎగ్జామ్స్ స్టార్ట్ అయి ముగిసినయి కూడా.. ఆ హడావిడి.. హంగామా లేకుండా.🫣
కరోనా బ్యాచితో పది పరీచ్చల మీద ఇంట్రెస్టే పోయింది జనాలకు. ఇంకేడ పట్టించుకుంటర్.
అందరూ పాసేపోర్రీ..!!
Daayi Sreeshailam