మా అంకాపూర్ ల కార్ల ట‌మాట‌లొస్త‌య‌న్నా… టమాట రేట్లు పెరిగితే ఇలా కార్ల‌లో వ‌స్త‌యి… గంప‌ల్లో వ‌స్తయ్‌… అంకాపూర్‌ల కారుకు వాల్యూ లేదు… ట‌మాట‌కు వాల్యూ…

ఓ రైతు త‌న కారులో గంప‌ల‌లో ట‌మాట‌లు తెచ్చిన విష‌యాన్ని చెబ‌తూ ఇలా వీడియో తీసి బ‌య‌ట‌పెట్టాడు. ఈ మ‌ధ్య ట‌మాటల రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. కిలో 40 నుంచి 50 వ‌ర‌కు ప‌లుకుతున్న‌ది. ఒక్కో బాక్సులో 25 కేజీల వ‌ర‌కు ఉంటాయి. ఈ బాక్సు ఒక్క‌దానికి వెయ్యి రూపాయ‌లు తీసుకుంటున్నారు అంకాపూర్ రైతులు. అక్క‌డి నుంచి కొనుగోలు చేసుకుంటున్న చోటామోటా వ్యాపారులు మార్కెట్లో దీనికి ఐదు ప‌ది పెంచి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. మాకు ట‌మాట‌లే ముఖ్యం… కియా కార్లు కాదు… అని అంకాపూర్ రైతు గ‌ర్వంగా త‌ను పండించిన పంట‌కు లాభ‌సాటి బేరం వ‌చ్చిన సంద‌ర్భంగా ఇలా సంబురంగా చెప్పుకుంటున్నాడు.

You missed