బంగారు తెలంగాణ నిర్మాణంలో ఏమో చేద్దామని పెద్ద సారు అనుకుంటాడు. ఇక్కడ అంతా బాగానే ఉంది. మనమే దేశానికి ఆదర్శమని 21 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లీనరీ వేదికగా గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ మనవాళ్లు బీహారీలను మించిపోతారు. ఎక్కువ మాట్లాడితే మీదకు టిప్పర్లు ఎక్కిస్తామంటాడు ఒకడు. ఏకంగా జర్నలిస్టులపైనే దాడులు చేయిస్తాడు. పట్నం మహేందర్ రెడ్డి లాంటి నేతలైతే బాహాటంగా బూతు పురాణాలు వినిపిస్తారు. అదే జరిగింది ఈ రోజు . మళ్లీ చాలా రోజులకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన నోటి దూలను ప్రదర్శించాడు. తాండూరు సీఐని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. చెప్పుకోపోరా నీ ఇష్టమున్న చోట అని కూడా తొడలు చరిచాడు. మరి అంతటి ధీమా ఆయనకు. తననెవరూ ఏమీ చేయరని. నిజమే. కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ ఎవరూ పట్నం మహేందర్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఈయన్నే కాదు.. ఇలాంటి నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. వాళ్లనీ ఏమీ చేయలేరు. వాళ్ల అసవరం పార్టీకి.. అదే.. అధిష్టానం పెద్దలకు అవసరం. వాళ్లు పెట్టే పెట్టుబడి అవసరం. వాళ్లు లేందే మనుగడ లేదు. వాళ్లు ఫ్యామిలీ ప్యాకేజీ కోరినా కాదనరు. బంగారు తెలంగాణలో ఇదంతా సహజం. కానీ ఇవన్నీ మామూలే. ఇప్పుడు మన దృష్టి ఇలాంటి చిన్న చిన్న చిల్లరమల్లర విషయాలపై లేదు. కేంద్రం, బీజేపీ, మోడీ, ప్రధాని.. దేశాన్ని మారుస్తా.. సైనికుడిలా నిలుస్తా… అనే నినాదాలపై ఉంది.
